‘నిన్నటి రోజు ఈరోజును ఎక్కువగా ఆక్రమించుకోనివ్వకండి’.. ప్రముఖ యాంకర్ ఆసక్తికర పోస్ట్

కేరళకు చెందిన ఆమె అయిన తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ.. స్టార్ యాంకర్‌గా గుర్తింపు సంపాదించుకుంది కనకాల సుమ.

Update: 2025-03-25 13:22 GMT
‘నిన్నటి రోజు ఈరోజును ఎక్కువగా ఆక్రమించుకోనివ్వకండి’.. ప్రముఖ యాంకర్ ఆసక్తికర పోస్ట్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: కేరళకు చెందిన ఆమె అయిన తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ.. స్టార్ యాంకర్‌గా గుర్తింపు సంపాదించుకుంది కనకాల సుమ. టీవీలో వేల ఎపిసోడ్లు ప్రసారమైన స్టార్ మహిళతో బుల్లితెరపై కెరీర్ స్టార్ట్ చేసిన సుమ మంచి పేరు దక్కించుకుంటుంది. స్టార్ మహిళతో పాటు, భలే చాన్సులే, పంచావతారం, క్యాష్, సూపర్ సింగర్ జీన్స్, అవాక్కయ్యారా, పట్టుకుంటే పట్టుచీర, లక్కు కిక్కు వంటి టీవీ కార్యక్రమాలకు యాంకర్‌గా వ్యవహరించి.. ప్రేక్షకుల్ని అలరించింది.

సుమ కేవలం టీవీ షోల్లోనే కాకుండా.. కళ్యాణ ప్రాపిరస్తు, కలిసి నడుద్దాం, పవిత్ర ప్రేమ, బాదుషా, ఢీ, స్వయంవరం, రావోయి చందమామ, గీతాంజలి, రాఘవ, పండండి సంసారం, స్వరాభిషేకం, జయమ్మ పంచాయతీ వంటి సినిమాల్లో కూడా నటించి జనాల మెప్పు పొందింది.

అలాగే ఈ యాంకర్‌కు ఉత్తమ టీవీ వ్యాఖ్యాతగా స్టార్ మహిళు సినీ గోర్ పురస్కారాన్ని అందుకుంది. సుమ చక్కగా మాట్లాడుతూ.. టైమింగ్ పంచులతో ఇప్పటికీ ప్రేక్షకల్ని ఆకట్టుకుంటుంది. తెలుగు, మలయాళంలతో పాటు హిందీ, ఇంగ్లీషు భాషల్లో కూడా చక్కగా మాట్లాడే టాలెంట్ తనలో ఉంది.

ఇకపోతే యాంకర్ సుమ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్‌తో జనాల్ని మెప్పిస్తుంది. తాజాగా బ్లాక్ శారీలో స్టన్నింగ్ ఫొటో షూట్ చేసింది. ఈ ఫొటోలను అభిమానులకు పంచుకుంది. ఈ పిక్స్‌తో పాటుగా.. ‘‘నిన్నటి రోజు ఈరోజును ఎక్కువగా ఆక్రమించుకోనివ్వకండి’’ అంటూ ఓ క్యాప్షన్ కూడా జోడించింది. ప్రస్తుతం సుమ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Full View

Tags:    

Similar News

Monami Ghosh