Allu Arjun: సుకుమార్ అలా అనడంతో ఆశ్చర్యపోయా.. లేడీ గెటప్ గురించి అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్ (వీడియో)

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్(Allu Arjun) కాంబినేషన్‌లో రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’.

Update: 2024-11-30 04:36 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్(Allu Arjun) కాంబినేషన్‌లో రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’. ఇందులో రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇందులోంచి విడుదలైన పోస్టర్స్(Posters), సాంగ్, టీజర్, ట్రైలర్ ఊహించని విధంగా యూట్యూబ్‌ను షేక్ చేశాయి. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ లేడీ గెటప్ పోస్టర్ అందరిలో ఆసక్తిని పెంచిందనడంలో అతిశయోక్తి లేదు. అయితే డిసెంబర్ 5న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఇక రిలీజ్ తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.

పలు ఈవెంట్‌కు హాజరవుతూ సినిమాపై హైప్ పెంచుతున్నారు. తాజాగా, ముంబైలో జరిగిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘ఈ పోస్టర్ ‘పుష్ప-2’పై అంచనాలను పెంచింది. ఇదంతా సుకుమార్(Sukumar) ఐడియానే. పోస్టర్స్ కోసం పుష్ప గెటప్‌తో, సఫారీ షూట్స్‌తో కొన్ని ఫొటోషూట్స్(Photoshoots) చేశాము. అవన్నీ బాగానే వచ్చాయి. అంతా అయిపోయాక ఇదంతా కాదు కొత్తగా చేద్దాం అని సుకుమార్ అనడంతో ఫోటోషూట్ అయ్యాక చెప్తాడేంటి అని ఆశ్చర్యపోయాను. ఫొటోషూట్ మొత్తం అయ్యాక మళ్ళీ చేద్దాం అంటావేంటి అని సుకుమార్‌ను అడిగితే నేను ఆడియన్స్‌ అందరికీ ఒక షాక్ ఇద్దాం అనుకుంటున్నా అన్నారు. ఏం షాక్ అంటే లేడీ గెటప్ అనడంతో నేను వాట్ అని ఆశ్చర్యపోయా.

దాంతో ఆయన ఏమనుకుంటున్నాడో మొత్తం చెప్పాడు. సుకుమార్ చెప్పినట్టు చేశాను. లేడీ గెటప్స్ మీద కూడా చాలా కష్టపడి రెండు సార్లు వర్కౌట్ అవ్వక మూడోసారి ఓకే చేశారు. నా లుక్ చూసిన తర్వాత సుకుమార్ క్రియేటివిటీ గురించి మరింత అర్థమయింది. నా లైఫ్ లోనే అత్యంత కష్టమైన సీక్వెన్స్(Sequence) ఈ గెటప్‌లో చేసిందే. ఇంతకంటే ఎక్కువ నేనేమి చెప్పను. సినిమాలో చూసి ఆ సీక్వెన్స్ ఎలా ఉందో మీరే చెప్పండి. క్రెడిట్(Credit) అంతా జీనియస్ సుకుమార్‌కు దక్కుతుంది’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.


Click Here For Twitter Post..


Read More...

Pushpa 2 : ముంబై ఈవెంట్ లో పుష్ప రాజ్, శ్రీవల్లి డాన్స్

Tags:    

Similar News