జానీ మాస్టర్ ఇష్యూలో అల్లు అర్జున్ ఇన్వాల్వ్‌మెంట్.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన పుష్ప నిర్మాత

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Choreographer Johnny Master) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-09-23 08:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Choreographer Johnny Master) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్‌ను లైంగికంగా వేధిస్తున్నాడని నార్సింగి పోలీసు స్టేషన్‌(Narsinghi Police Station)లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద FIR నమోదు చేసుకొని.. గోవాలో ఉన్న జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేశారు. కాగా కోర్టు జానీకి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలో జానీ మాస్టర్ వ్యవహారంపై పలు సెలబ్రెటీలు స్పందించగా.. తాజాగా పుష్ప సినిమా నిర్మాత రవిశంకర్(Ravi Shankar) స్పందించారు.

ఆయన మాట్లాడుతూ.. “ఇది జానీ మాస్టర్, అమ్మాయికి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం. ఆమె పుష్ప 2 సినిమాలో అడిషనల్ కొరియోగ్రాఫర్. ఆమెతో వర్క్ చేయించుకున్నాం. అలాగే జానీ మాస్టర్‌తో ఓ ఐటెమ్ సాంగ్ చేయించుకోవాల్సింది ఉంది. కానీ, ఈలోపే ఇలా జరిగింది. ఈ విషయంలో అల్లు అర్జున్‌(Allu Arjun)కు సంబంధం లేదు” అని నిర్మాత రవిశంకర్ వెల్లడించారు. కాగా ఈ ఇష్యూలో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్(Sukumar) ఇన్వాల్వ్ అయ్యారన్న ప్రచారంపై ఆయన స్పందించినట్లు తెలుస్తోంది.


Similar News