Ajith Kumar: సెన్సార్ పూర్తి చేసుకున్న‘విదాముయార్చి’ మూవీ.. ఏ సర్టిఫికెట్ వచ్చిందంటే?

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎప్పటికప్పుడు అభిమానులను అలరిస్తున్నారు.

Update: 2025-01-09 08:58 GMT

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎప్పటికప్పుడు అభిమానులను అలరిస్తున్నారు. ప్రస్తుతం చేతినిండా భారీ ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న ఆయన డైరెక్టర్ మాగిజ్ తిరుమేని(Magiz Thirumeni) దర్శకత్వంలో ‘విదాముయార్చి’(Vidaamuyarchi) మూవీ చేస్తున్నారు. ఇందులో అజిత్ కుమార్ సరసన స్టార్ బ్యూటీ త్రిష(Trisha Krishnan) హీరోయిన్‌గా నటిస్తుండగా.. దీనిని లైకా ప్రొడక్షన్స్(Lyca Productions) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమా పొంగల్‌కు విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడినట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. విదాముయార్చి విడుదల తేదీని మూవీ టీం అధికారికంగా ప్రకటించనప్పటికీ, జనవరి చివరి వారంలో విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘విదాముయార్చి’ సెన్సార్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు యూఏ సర్టిఫికెట్ రాగా.. ఈ యాక్షన్ థ్రిల్లర్(Action thriller) రన్‌టైమ్ 2 గంటల 30 నిమిషాలు ఉన్నట్లు టాక్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పలు పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Tags:    

Similar News