Sa:Kutumbanam: స:కుటుంబానాం అంటున్న మేఘ ఆకాష్.. ఆకట్టుకుంటున్న లిరికల్ వీడియో
మేఘ ఆకాష్ (Megha Akash), రామ్ కిరణ్ (Ram Kiran) జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘స:కుటుంబానాం’.
దిశ, సినిమా: మేఘ ఆకాష్ (Megha Akash), రామ్ కిరణ్ (Ram Kiran) జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘స:కుటుంబానాం’ (Sa:Kutumbanam). హెచ్.ఎన్.జి సినిమాస్ పతాకంపై, హెచ్. మహాదేవ గౌడ, హెచ్.నగరత్న నిర్మిస్తున్న ఈ మూవీకి ఉదయ్ శర్మ (Uday Sharma) దర్శకత్వం వహిస్తున్నాడు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ (Clean Family Entertainer)గా రూపొందిన ‘స:కుటుంబానాం’ సినిమా అందరికీ నచ్చుతుందని ప్రమోషనల్ కంటెంట్ (Promotional Content)తో ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ (lyrical song)ను విడుదల చేశారు.
‘అది దా సారు’ (Adi Dha Saru) అంటూ సాగిన ఈ పాటకు లిరిక్స్ అనంత శ్రీరామ్ (Ananta Sriram) అందించగా.. మణిశర్మ (Manisharma) సంగీతాన్ని అందించడం జరిగింది. ముఖ్యంగా ఈ పాటలోని లిరిక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో మేఘా ఆకాష్ లుక్ చాలా సరికొత్తగా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, సత్య, శుభలేఖ సుధాకర్, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.