కొత్త సినిమా ప్రకటించిన సూరి.. హీరోయిన్ ఎవరంటే?

కోలీవుడ్ నటుడు సూరి(Soori) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

Update: 2024-12-16 13:00 GMT

దిశ, సినిమా: కోలీవుడ్ నటుడు సూరి(Soori) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆయన తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి హాస్య నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గత ఏడాది ‘విడుదల’(Viduthalai Part 1) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ఆయన ‘విడుదల-2’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా, సూరి ఓ కొత్త మూవీని ప్రకటించాడు. ఈ మేరకు ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘నా తదుపరి చిత్రానికి టైటిల్ ‘మామన్’ (Maaman) ఫిక్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది.

దీనికి సంబంధించిన పూజా కార్యక్రమం ఈ రోజు పూర్తయింది. అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి’’ అని రాసుకొచ్చాడు. అంతేకాకుండా పూజకు సంబంధించిన ఫొటోలను నెట్టింట పెట్టాడు. అలాగే ఓ పాపను ఎత్తుకున్న పోస్టర్‌ను కూడా షేర్ చేశాడు. అయితే ఈ సినిమాకు ‘విలంగ్’ ఫేమ్ ప్రశాంత్ పాండియరాజ్(prashanth pandiyaraj) దర్శకత్వం వహిస్తుండగా.. లార్క్ స్టూడియోస్(Lark Studios) బ్యానర్‌పై కుమార్ నిర్మిస్తున్నారు. ఇందులో ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi) హీరోయిన్‌గా నటిస్తుంది.

Tags:    

Similar News