Natural star Nani: సాల్ట్ పెప్పర్ హెయిర్ లుక్‌లో నాని.. వైరల్‌గా మారిన పిక్స్

నేచురల్ స్టార్ నాని (Natural star Nani) వరుస హిట్స్ అందుకుంటూ స్టార్ హీరోగా ఇండస్ట్రీ (Industry)లో దూసుకుపోతున్నాడు.

Update: 2024-12-16 14:46 GMT

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని (Natural star Nani) వరుస హిట్స్ అందుకుంటూ స్టార్ హీరోగా ఇండస్ట్రీ (Industry)లో దూసుకుపోతున్నాడు. ప్రజెంట్ ఆయన చేతిలో రెండు, మూడు ప్రాజెక్టులు ఉండగా.. అందులో 'HIT: The 3rd Case' ఒకటి. ఈ చిత్రానికి డాక్టర్ శైలేష్ కొలను (Dr. Shailesh Kolanu) దర్శకత్వం వహిస్తు్న్నారు. అయితే.. ఈ సినిమా కోసం నాని లుక్ టోటల్‌గా చేంజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా నాని కొత్త లుక్ నెట్టింట వైరల్‌గా మారింది. వైట్ బ్లేజర్‌ (White Blazer)లో సాల్ట్ పెప్పర్ లాంగ్ హెయిర్ (Salt Pepper Long Hair) లుక్‌లో కనిపించాడు. అయితే ఈ లుక్ HIT: 3 కి సంబంధించిందేనని ఇన్‌సైడ్ టాక్ వినిపిస్తుండగా.. న్యూ లుక్‌లో దర్శనమిచ్చి మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచేస్తున్నారు హీరో. ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. ఇందులో హిట్ ఆఫీసర్‌గా నాని క్యారెక్టర్‌ను పరిచయం చేసిన గ్రిప్పింగ్ గ్లింప్స్‌కు సోషల్ మీడియాలో ట్రెమండస్ రెస్పాన్స్ రాగా.. మూవీపై హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి.

Tags:    

Similar News