Salman Khan: స్టార్ హీరో బర్త్‌డే స్పెషల్‌గా వచ్చేస్తున్న టీజర్.. ట్వీట్ వైరల్

బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) నటిస్తున్న తాజా చిత్రం ‘సికందర్’ (Sikandar).

Update: 2024-12-16 14:34 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) నటిస్తున్న తాజా చిత్రం ‘సికందర్’ (Sikandar). ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్ నటియాద్వాలా నిర్మిస్తున్నాడు. ఇందులో పాపులర్ యాక్టర్ సత్యరాజ్ (Satyraj) ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇక సమాజంలోని అవినీతి, నేరాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 2025 ఈద్ స్పెషల్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం.

దీంతో ఈ మూవీ నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ టీజర్ (teaser) రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు చిత్ర బృందం. సల్మాన్ ఖాన్ బర్త్‌డే సందర్భంగా డిసెంబర్ 27న సికందర్ టీజర్ రాబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్‌గా మారడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News