‘ఆ విషయం చాలా బాధ కలిగించింది.. కానీ’: హీరోయిన్ కామెంట్స్ వైరల్
హీరోయిన్ ఆషిక రంగనాత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.
దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ ఆషిక రంగనాత్(Aashika Ranganathan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ క్రేజీ బాయ్(crazy boy) అనే చిత్రంతో సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తెలుగులో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) సరసన ‘నా సామిరంగ’(na Samiranga) అనే సినిమాలో నటించింది. తెలుగులో ఆషిక మొదటి మూవీ ఇదే. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో ఈ అమ్మడుకు సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కింది. కేవలం తెలుగు, కన్నడలో మాత్రమే కాకుండా కోలీవుడ్(Kollywood) లో నటించి.. తన సత్తాను చాటిది. నటుడు అధర్వ(Adharva)తో పట్టత్తు అరసన్(Patattu Arasan) సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా హీరో సిద్ధార్థ్(Siddharth) నటించిన ‘మిస్ యూ’(miss you) సినిమాలో కథానాయికగా నటించింది.
అలాగే కార్తీ(Karthi)కి జంటగా సర్ధార్-2 (Sardhar-2), మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) సరసన విశ్వంభర(Viśvambhara) మూవీలో అవకాశాలు కొట్టేసింది. అయితే ఈ సినిమా నిర్మాణ కార్యక్రమం కంప్లీట్ చేసుకుంది. కాగా నవంబరు 29 వ తేదీన థియేటర్లలో రిలీజ్ అవ్వాల్సింది. కానీ పలు కారణాల వల్ల ఈ మూవీ వాయిదా పడాల్సి వచ్చింది. దీనిపై హీరోయిన్ ఆషికా రంగనాథ్ స్పందిస్తూ.. ‘మిస్ యూ సినిమా వాయిదా పడడం నిజంగా బాధ కలిగిస్తుంది. కానీ అంతా మంచే జరుగుతుందని నమ్ముతున్నాను. ఇదువరకు నిర్ణయించిన డేట్ కంటే ఇప్పుడు ఇంకా బెటర్ తేదీన రిలీజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎక్కువ మంది ప్రేక్షకులు వీక్షించాలంటే. వాయిదా అనే నిర్ణయం సరైనదని’ నటి ఆషిక రంగనాథ్ చెప్పుకొచ్చింది.