Upendra: యూఐ ట్రైలర్‌పై స్పందించిన స్టార్ హీరో.. చూడగానే షాక్ అయ్యా అంటూ కామెంట్స్

కన్నడ (Kannada) సూపర్ స్టార్ ఉపేంద్ర (Upendra) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘యూఐ’ (UI).

Update: 2024-12-12 13:41 GMT

దిశ, సినిమా: కన్నడ (Kannada) సూపర్ స్టార్ ఉపేంద్ర (Upendra) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘యూఐ’ (UI). లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్టైనర్స్, కెపీ శ్రీకాంత్ నిర్మాతలుగా, నవీన్ మనోహరన్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఉపేంద్ర కెరీర్‌లోనే భారీ బడ్జెట్ (huge budget) అండ్ క్రేజీ ప్రాజెక్ట్‌ (Crazy Project)గా తెరకెక్కుతున్న ‘యూఐ’ చిత్రం నుంచి ఇప్పటివరకూ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్‌ (Promotional Content)కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల ట్రైలర్ (Trailer) కూడా రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

అయితే.. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌పై బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) స్పందిస్తూ.. ‘ఈ ట్రైలర్ చూడగానే షాక్ అయ్యాను. అద్భుతంగా ఉంది. కచ్చితంగా మూవీ సూపర్ సక్సెస్ అందుకుంటోంది’ అంటూ ప్రశంసలు కురిపించారు. ఇక అమీర్ ఖాన్ కామెంట్స్‌పై ఉపేంద్ర స్పందిస్తూ.. ‘ప్రియమైన అమీర్ సార్ మిమ్మిల్ని కలవడంతో నా కల నిజమైంది. UI ది వార్నర్ మూవీకి మీ ప్రేమ అండ్ మద్దతుకు ధన్యవాదాలు’ అని చెప్పుకొచ్చాడు. ఇక అమీర్ ఖాన్ కామెంట్స్‌తో మూవీపై మరిన్ని అంచనాలు పెరిగాయి. కాగా.. యూఐ సినిమా భారీ అంచనాల మధ్య ఈ నెల 20 న ప్రంపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Tags:    

Similar News