Siddharth: ఇండస్ట్రీ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలి.. పుష్ప-2 కాంట్రవర్సీపై స్పందించిన సిద్ధార్థ్
హీరో సిద్దార్థ్(Siddharth) గత ఏడాది ‘చిన్నా’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకు
దిశ, సినిమా: హీరో సిద్దార్థ్(Siddharth) గత ఏడాది ‘చిన్నా’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని.. ఇప్పుడు ‘మిస్ యూ’(Miss you) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. కోలీవుడ్ డైరెక్టర్ రాజశేఖర్(Rajasekhar) తెరకెక్కించిన ఈ సినిమాలో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తుంది. 7 మిల్స్ పర్ సెకండ్ బ్యానర్‌పై శ్యామ్యూల్ మ్యాథ్యూ నిర్మిస్తున్నా ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ‘మిస్ యూ’ నవంబర్ 29న విడుదల కావాల్సి ఉండగా పోస్ట్ పోన్ అయి డిసెంబర్ 13న విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే ఇటీవల ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధార్థ్.. పుష్ప-2 ఈవెంట్‌కు లక్షల్లో ఆడియన్స్ హాజరకావడంపై స్పందిస్తూ ‘సినిమాకు, దాని ప్రమోషన్స్‌కు జనాలు రావడానికి సంబంధం లేదు. ఏ పనులు జరుగుతున్న వాటిని చూడటానికి జనాలు వస్తారు’ అని కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్ వైరల్ కావడంతో అతన్ని కొందరు విమర్శించారు.
ఇందులో భాగాంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధార్థ్‌ను ‘మీకు అల్లు అర్జున్ (Allu Arjun)తో ఏదైనా ప్రాబ్లెం ఉందా’ అనే ప్రశ్న ఎదురైంది. దీనిపై క్లారిటీ ఇస్తూ.. ‘నాకు ఎవరితో ఏ సమస్య లేదు. ‘పుష్ప-2’ (Pushpa-2) విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. పుష్ప సూపర్ సక్సెస్ (Super Success) అయింది కాబట్టి పార్ట్-2 చూసేందుకు ప్రేక్షకులు భారీగా ఇంట్రెస్ట్ చూపించారు. ఈవెంట్లకు ఎంతమంది ఆడియన్స్ వస్తే అంత మంచిది. అలాగే థియేటర్లకు కూడా అంతే మంది ప్రేక్షకులు రావాలని ఆశిద్దాం. ఎందుకంటే ఇండస్ట్రీ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలి’ అంటూ చెప్పుకొచ్చారు.