ఆ స్టార్ హీరోను కాపీ కొడుతున్నావా అని ప్రదీప్‌ను అడిగిన నెటిజన్.. ఆయన రియాక్షన్ ఏంటంటే? (వీడియో)
కోలీవుడ్ డైరెక్టర్, యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) ‘కోమలి’ చిత్రంతో పరిచయం అయి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

దిశ, సినిమా: కోలీవుడ్ డైరెక్టర్, యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) ‘కోమలి’ చిత్రంతో పరిచయం అయి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. మరీ ముఖ్యంగా ‘లవ్ టుడే’(Love Today) సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఈ మూవీని తెలుగులోనూ రీమేక్ చేసి తన నటనతో అందరినీ మెప్పించాడు. ఇటీవల ప్రదీప్ ‘డ్రాగన్’ (Dragon)మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని సాధించారు. అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని AGS ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. అయితే ఇందులో ప్రదీప్ సరసన అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran), కయదు లోహర్ (Kaydu Lohar)హీరోయిన్లుగా నటించగా.. జార్జ్ మరియన్, రవికుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్(Gautam Vasudev Menon), మిస్కిన్‌లు కీలక పాత్రలో కనిపించారు.
అయితే ఫిబ్రవరి 21న వచ్చిన ఈ చిత్రం వంద కోట్ల క్లబ్బులో జాయిన్ అయింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో యూనిట్ అంతా కలిసి సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. సోమవారం నిర్వహించిన ఈ సక్సెస్ మీట్‌లో.. ప్రదీప్ ఓ వ్యక్తి ‘‘మీ పర్ఫామెన్స్ బాగుంటుంది కానీ స్క్రీన్‌పై చూసినప్పుడు ధనుష్‌ను కాపీ చేసినట్లుగా అనిపిస్తుంది. ఆ విషయాన్ని మీరు గ్రహించారా? అని అడగ్గా.. దానికి ప్రదీప్ స్పందిస్తూ.. ‘‘చాలాకాలంగా ఇలాంటి కామెంట్స్ వింటూనే ఉన్నాను. కాకపోతే నేను ఎవరినీ ఇమిటేట్ చేయను. నా ఫిజిక్, ఫేస్‌కట్ వల్ల మీ అందరూ అలా పొరబడుతున్నారు. సేమ్ ధనుష్‌లాగే ఉండటం మీకు ప్లస్ అయిందా? అని అడగ్గా.. అదంతా నాకు తెలియదు.. కానీ నేను అద్దంలో చూసుకున్నప్పుడు మాత్రం నాకు నేను మాత్రమే కనపడతాను.
ప్రస్తుతం నా సినిమా థియేటర్స్‌లో బాగానే ఆడుతోందంటే.. నేను మంచిగా చేస్తున్నానే అనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చాడు. అనంతరం డైరెక్టర్ అశ్వత్ మైక్ తీసుకుని ఫుల్ ఫైర్ అవుతూ మాట్లాడాడు. ‘‘మీ కళ్లకు మాత్రమే ప్రదీప్ , ధనుష్‌లా కనిపిస్తున్నాడేమో కానీ నాకు మాత్రం ప్రదీప్‌లాగే ఉన్నాడు. కేవలం ఆయనను మిగతా హీరోతో పోల్చాలని ఇలాంటి ప్రశ్న అడిగినట్లుగా అనిపిస్తుంది. నేను ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రదీప్‌లో నేను ఏ ఇతర హీరోను చూడలేదు. మీరు కట్ చేసి నాకు పంపండి అప్పుడు నీకు క్లారిటీ ఇస్తాను’’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ప్రదీప్ లో నాకు మరే ఇతర నటుడు కనిపించట్లేదు..
— Filmy Focus (@FilmyFocus) March 3, 2025
బయట వచ్చే కంపేరిజన్స్ అన్నీ నామమాత్రానికే..#PradeepRanganathan #Dhanush #ReturnOfTheDragon pic.twitter.com/se5TsIkKJR