బ్లాక్ అండ్ వైట్ షేడ్స్‌లో ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చిన బ్యూటీ.. నేచురల్ లుక్‌లో అదిరిపోయిందిగా అంటూ కామెంట్స్

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2025-03-25 08:55 GMT
బ్లాక్ అండ్ వైట్ షేడ్స్‌లో ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చిన బ్యూటీ.. నేచురల్ లుక్‌లో అదిరిపోయిందిగా అంటూ కామెంట్స్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాయి పల్లవి ప్రేమమ్’(Premam) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తన ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది.ఆ తర్వాత ‘ఫిదా’(Fidaa) సినిమాలో నటించి మెప్పించింది. అంతే కాకుండా తన యాక్టింగ్‌తో అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేసేసింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అంతే కాకుండా బోల్డ్ సీన్స్‌లో యాక్ట్ చేయకపోవడం, మేకప్ వేసుకోకపోవడం వల్ల మరింత ఫేమ్ అయింది.

ఇక ఈ భామ డ్యాన్స్‌కి అయితే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. అయితే సాయి పల్లవి రీసెంట్‌గా ‘అమరన్’(amaran) మూవీతో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అలాగే నాగ చైతన్య(Naga chaitanya) హీరోగా చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వంలో వచ్చిన ‘తండేల్’(Thandel) సినిమాలో హీరోయిన్‌గా నటించి అలరించింది. తన యాక్టింగ్‌తో ఆడియన్స్‌ నుంచి ఫుల్ మార్కులే కొట్టేసింది.

లవర్స్ డే కానుకగా అల్లు అరవింద్ (Allu aravind) సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు(Bunny Vasu) నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో చాలా అరుదుగా ఉండే సాయి పల్లవి.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బ్లాక్ అండ్ వైట్ షేడ్స్‌లో ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. అంతేకాకుండా చాలా నేచురల్ లుక్‌లో వావ్ అనిపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. సింపుల్ లుక్‌లో చాలా బాగున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News