హలో సమ్మర్ అంటూ నోరూరిస్తున్న 40 ఏళ్ల స్టార్ హీరోయిన్.. మీకేమైనా న్యాయంగా అనిపిస్తుందా అంటూ నెటిజన్ల కామెంట్స్
అలనాటి స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘వర్షం’(Varsham) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.
దిశ, వెబ్‌డెస్క్: అలనాటి స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘వర్షం’(Varsham) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. కానీ సడెన్‌గా ఏమైందో ఏమోకానీ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చి.. వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉంది. అలా ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మ చేతిలో దాదాపు 7 సినిమాలకు పైనే ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. ఓ పక్కా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తుంది. అలాగే తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా త్రిష ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ స్టోరీ పెట్టింది. అందులో హలో సమ్మర్ అంటూ బాగా పండిన మామిడి కాయను ముక్కలుగా కోసి పెట్టింది. ఇక వాటిని చూస్తూ నోరూరుతుంది అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. ఇలా నోరూరించడం మీకేమైనా న్యాయంగా అనిపిస్తుందా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Read More..
Trisha : త్రిష బోల్డ్ ఫోటోలు వైరల్.. మరీ ఇంత హాట్ గా!