Samyukta : ఆయనతో నటించడం అదృష్టంగా భావిస్తున్నా.. హీరోయిన్ సంయుక్త కామెంట్స్ వైరల్
హీరోయిన్ సంయుక్త (Samyukta) రీసెంట్‌గా గుంటూరు(Guntur)లో సందడి చేసింది.

దిశ, సినిమా: హీరోయిన్ సంయుక్త (Samyukta) రీసెంట్‌గా గుంటూరు(Guntur)లో సందడి చేసింది. నగరంలోని లక్ష్మీపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ గోల్డ్ షాక్ ఓపినింగ్‌కి వెళ్లిన ఆమె.. ప్రారంభోత్సవం అనంతరం మీడియా(Media)తో మాట్లాడుతూ ‘అఖండ-2’ (Akhanda-2) సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘‘అఖండ-2’ సినిమాలో హిరోయిన్‌గా నటించడం ఆనందంగా ఉంది. బాలయ్య గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం’ అని చెప్పుకొచ్చింది. కాగా.. ‘అఖండ-2’ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ‘అఖండ’కు సీక్వెల్‌గా రాబోతున్న విషయం తెలసిందే. నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna) హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుంది. బాలయ్య రెండో కూతురు తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే బాలయ్య-బోయపాటి కాంబోలో వచ్చిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అలాగే ‘అఖండ’ కూడా సూపర్ సక్సెస్ అందుకోవడంతో ‘అఖండ-2’ పై నందమూరి ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.