అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్రైలర్ విడుదల.. ప్రేక్షకుల్లో భారీ హైప్ పెంచుతోన్న తల్లికొడుకుల మధ్య యుద్ధం?
ప్రదీప్ చిలుకూరి (Pradeep Chilukuri) దర్శకత్వం వహించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి (Arjun Son of Vyjayanthi) సినిమా ఏప్రిల్ 18 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రదీప్ చిలుకూరి (Pradeep Chilukuri) దర్శకత్వం వహించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి (Arjun Son of Vyjayanthi) సినిమా ఏప్రిల్ 18 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ (Kalyan Ram) అండ్ విజయశాంతి (Vijayashanthi)ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. నేడు ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు మేకర్. ఇక ఈ కార్యక్రమంలోనే ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ప్రస్తుతం ట్రైలర్ రిలీజ్ అయిన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఈ ట్రైలర్ సినిమాపై జనాల్లో భారీ హైప్ పెంచుతోంది. ఇక సాయి మంజ్రేకర్ (Sai Manjrekar) కథానాయికగా నటిస్తోన్న ఈ ట్రైలర్ చూస్తే.. నటి విజయశాంతి ఐపీఎస్ అధికారిగా పని చేస్తుంది. తన కొడుకు అర్జున్ (కల్యాణ్ రామ్). తల్లి కొడుకు మధ్య మనస్పర్థలు వస్తాయి. దీంతో వీరిద్దరి మధ్య దూరం పెరుగుతుంది. తల్లి చట్టం ప్రకారం అర్జున్ ను శిక్షించాలని చూస్తుంది. మొత్తానికి ట్రైలర్ ఆసక్తికరంగా సాగుతోంది. సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది.