AP News:ఆటో డ్రైవర్లకు సీఐ కీలక సూచనలు

ఆటో డ్రైవర్లు రోడ్డు నిబంధనలు పాటించాలని, ఎవరైనా అతిక్రమించి ప్రయాణికులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.

Update: 2024-08-29 14:43 GMT

దిశ,పాణ్యం:ఆటో డ్రైవర్లు రోడ్డు నిబంధనలు పాటించాలని, ఎవరైనా అతిక్రమించి ప్రయాణికులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. గురువారం పోలీస్ స్టేషన్‌లో పాణ్యం మండల కేంద్రంలోని ఆటో డ్రైవర్లను పోలీస్ స్టేషన్‌కి పిలిచి ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డితో కలిసి ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో నడిపే ప్రతి ఒక్కరు విధిగా డ్రైవింగ్ లైసెన్స్, ప్రమాద బీమా కలిగి ఉండాలన్నారు. రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ ఆటోలు ఆపి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దాన్నారు. ప్రయాణికులను ఎక్కించుకునేటప్పుడు..దించేటప్పుడు రోడ్డుకు పూర్తిగా పక్కకు వెళ్లి ఆపాలన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలో ఎక్కించవద్దాన్నారు. ఆటోలో ప్రయాణించే వారితో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


Similar News