ప్రాణాలతో పోరాడుతున్న వరుణ్ సింగ్ బెంగళూరుకు తరలింపు
న్యూఢిల్లీ: హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్‌ను బెంగుళూరుకు తరలించారు. వెల్లింగ్టన్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న ఆయనను మెరుగైన వైద్యం కోసమే తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇంతకుముందు అయన పరిస్థితి విషమంగా ఉందని, సింగ్‌కు ఇప్పటివరకు మూడు ఆపరేషన్లు చేశామని కోయంబత్తూరులోని అధికారిక వర్గాలు వెల్లడించాయి. మరోవైపు పార్లమెంటులో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ వరుణ్ సింగ్‌ను బ్రతికించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. వరుణ్ […]
న్యూఢిల్లీ: హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్‌ను బెంగుళూరుకు తరలించారు. వెల్లింగ్టన్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న ఆయనను మెరుగైన వైద్యం కోసమే తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇంతకుముందు అయన పరిస్థితి విషమంగా ఉందని, సింగ్‌కు ఇప్పటివరకు మూడు ఆపరేషన్లు చేశామని కోయంబత్తూరులోని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు పార్లమెంటులో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ వరుణ్ సింగ్‌ను బ్రతికించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. వరుణ్ తండ్రి కల్నల్ కేపీ సింగ్ తన కుమారుడి పరిస్థితిపై ఇప్పుడే ఏం చెప్పలేనని పేర్కొన్నారు. వరుణ్ సోదరుడు తనుజ్ నావీలో లెఫ్టినెంట్ కమాండర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతేడాది ఎల్‌సీఏ తేజస్ యుద్ధ విమానాన్ని కాపాడినందుకుగానూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వం వరుణ్ సింగ్‌ను శౌర్య చక్రతో సత్కరించింది.