సిర్పూర్ పేపర్ మిల్లులో క్లోరిన్ గ్యాస్ లీక్

దిశ, ఆదిలాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఉన్న సిర్పూర్ పేపర్ మిల్లులో క్లోరిన్ గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపింది. గ్యాస్ లీక్ అయిన సమయంలో ప్లాంట్ వద్ద ఐదారుగురు కార్మికులు మాత్రమే పని చేస్తున్నట్లు సమాచారం. గ్యాస్ లీక్ కారణంగా కార్మికులకు కళ్ల మంటలు, ఉబ్బసం మొదలయ్యాయి. దీంతో కార్మికులు అక్కడినుంచి దూరం జరిగినట్లు చెబుతున్నారు. అయితే వీరిలో రాజం అనే వ్యక్తి మాత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శ్వాస […]

Update: 2020-05-11 10:34 GMT

దిశ, ఆదిలాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఉన్న సిర్పూర్ పేపర్ మిల్లులో క్లోరిన్ గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపింది. గ్యాస్ లీక్ అయిన సమయంలో ప్లాంట్ వద్ద ఐదారుగురు కార్మికులు మాత్రమే పని చేస్తున్నట్లు సమాచారం. గ్యాస్ లీక్ కారణంగా కార్మికులకు కళ్ల మంటలు, ఉబ్బసం మొదలయ్యాయి. దీంతో కార్మికులు అక్కడినుంచి దూరం జరిగినట్లు చెబుతున్నారు. అయితే వీరిలో రాజం అనే వ్యక్తి మాత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో ఆయనను కాగజ్ నగర్‎ ఆసుపత్రిలో చేర్చారు. గ్యాస్ ఎక్కువ మొత్తంలో శరీరంలోకి వెళ్లి ఉంటే కార్మికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండేదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రాజం కోలుకుంటున్నట్లు డాక్టర్లు స్పష్టం చేశారు. అయితే తమ మిల్లులో ఎలాంటి ప్రమాదం సంభవించలేదని సిర్పూర్ పేపర్ మిల్ యాజమాన్యం మీడియాకు ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

Tags:    

Similar News