చిన్నారులకు అండగా ‘చిట్యాల’ పోలీసులు

దిశ, రేగొండ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని పాశిగడ్డ తండాకు చెందిన భూక్య వసంత- సురేష్ దంపతులు అనారోగ్యంతో ఇటీవలే మృతి చెందారు. దీంతో వారి నలుగురు పిల్లలు దిక్కుమొక్కు లేని అనాథలుగా మిగిలారు. ఈ క్రమంలోనే చిట్యాల సీఐ పులి వెంకట్ గౌడ్, రేగొండ ఎస్ఐ గుర్రం కృష్ణ ప్రసాద్ గౌడ్‌లు చిన్నారులకు ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. భూక్య వసంత సురేశ్ దంపతులకు తిరుపతి (16 ) లక్ పతి […]

Update: 2021-11-09 10:10 GMT

దిశ, రేగొండ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని పాశిగడ్డ తండాకు చెందిన భూక్య వసంత- సురేష్ దంపతులు అనారోగ్యంతో ఇటీవలే మృతి చెందారు. దీంతో వారి నలుగురు పిల్లలు దిక్కుమొక్కు లేని అనాథలుగా మిగిలారు. ఈ క్రమంలోనే చిట్యాల సీఐ పులి వెంకట్ గౌడ్, రేగొండ ఎస్ఐ గుర్రం కృష్ణ ప్రసాద్ గౌడ్‌లు చిన్నారులకు ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.

భూక్య వసంత సురేశ్ దంపతులకు తిరుపతి (16 ) లక్ పతి (10 )సంజన ( 8 ) రాజేష్ ( 6 ) నలుగురు పిల్లలు ఉండగా, వీరికి రూ.25000 వేల ఆర్థిక సాయంతో పాటు 1 క్వింటా బియ్యాన్ని మంగళవారం అందజేశారు. భవిష్యత్తులో వారిని తీర్చిదిద్దడానికి ప్రభుత్వ గురుకుల హాస్టళ్లలో చేర్పించి విద్యాబోధన కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఫ్రెండ్లీ పోలీస్ అనే నినాదంతో అనాధలకు అండగా నిలిచిన చిట్యాల సీఐ పులి వెంకట్ గౌడ్, రేగొండ ఎస్ఐ గుర్రం కృష్ణ ప్రసాద్ గౌడ్‌లను గ్రామస్తులు అభినందించారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఈ చిన్నారులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Tags:    

Similar News