అసెంబ్లీ సమావేశాల్లో బీటీ రోడ్లపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రస్తావన

దిశ, మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి శుక్రవారం అసెంబ్లీలో గళమెత్తారు. మక్తల్-నారాయణపేట మధ్య ఉన్న బీటీ రోడ్డుపై పడిన గుంతలు పూడ్చాలన్నారు. అంతర్రాష్ట్ర రహదారి గుల్బర్గాకి అనుసంధానమైన మక్తల్-నారాయణపేట బీటీరోడ్డు.. గుంతలు పడి ప్రయాణానికి అసౌకర్యం ఏర్పడిందన్నారు. వాహనదారులు నానా తిప్పలు పడుతున్నారని, బీటీ రోడ్డుపై గుంతలు పూడ్చాలని ఎమ్మెల్యే చిట్టెం రామన్న మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత తొమ్మిది నెలల కిందట టెండర్‌ను దక్కించుకున్న కాంట్రాక్టర్ నేటికీ పనులు పూర్తి […]

Update: 2021-10-01 05:55 GMT

దిశ, మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి శుక్రవారం అసెంబ్లీలో గళమెత్తారు. మక్తల్-నారాయణపేట మధ్య ఉన్న బీటీ రోడ్డుపై పడిన గుంతలు పూడ్చాలన్నారు. అంతర్రాష్ట్ర రహదారి గుల్బర్గాకి అనుసంధానమైన మక్తల్-నారాయణపేట బీటీరోడ్డు.. గుంతలు పడి ప్రయాణానికి అసౌకర్యం ఏర్పడిందన్నారు. వాహనదారులు నానా తిప్పలు పడుతున్నారని, బీటీ రోడ్డుపై గుంతలు పూడ్చాలని ఎమ్మెల్యే చిట్టెం రామన్న మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత తొమ్మిది నెలల కిందట టెండర్‌ను దక్కించుకున్న కాంట్రాక్టర్ నేటికీ పనులు పూర్తి చేయలేదన్నారు. ఈ విషయంపై సంబంధిత మంత్రి స్పందించి సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్ అండ్ బీ అధికారుల దృష్టికి వెళ్లినా ఎటువంటి పనులు మొదలుపెట్టలేదని ఎమ్మెల్యే ప్రస్తావించగా.. ఈ విషయాన్ని సంబంధిత మంత్రి నోట్ చేసుకున్నట్టు సమాచారం.

Tags:    

Similar News