డాక్టర్లపై పుష్పాభివందనం అభినందనీయం : చిరు
దిశ, వెబ్ డెస్క్: భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై దేశవ్యాప్తంగా ప్రాణాలకు తెగించి పోరాడుతున్నవారికి అరుదైన గౌరవం దక్కింది. ముందుండి నిలబడి కరోనాతో యుద్ధం చేస్తున్న కరోనా వారియర్స్ పై ఆకాశంలో నుంచి పూల వర్షం కురిసింది. కరోనా యోధులకు సంఘీభావంగా వారిపై గగనతలం నుంచి పూల వర్షం కురిపించడం అభినందనీయం అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీటర్ వేదికగా వైద్యులు, సైనికులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘సరిహద్దులు దాటి వచ్చే […]
దిశ, వెబ్ డెస్క్: భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై దేశవ్యాప్తంగా ప్రాణాలకు తెగించి పోరాడుతున్నవారికి అరుదైన గౌరవం దక్కింది. ముందుండి నిలబడి కరోనాతో యుద్ధం చేస్తున్న కరోనా వారియర్స్ పై ఆకాశంలో నుంచి పూల వర్షం కురిసింది. కరోనా యోధులకు సంఘీభావంగా వారిపై గగనతలం నుంచి పూల వర్షం కురిపించడం అభినందనీయం అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీటర్ వేదికగా వైద్యులు, సైనికులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘సరిహద్దులు దాటి వచ్చే ఉగ్రవాదుల పైన పోరాడి, దేశాన్ని కాపాడే వీర సైనికులు, కనిపించని వైరస్ అందరిపైన దాడి చేస్తుంటే, అహర్నిశలు మనల్ని కాపాడేందుకు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి పుష్పాభివందనం చేయడం అభినందనీయం. మీ ఇద్దరికి మేమంతా రుణపడి ఉన్నాం. జై హింద్’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. వైద్యో నారాయణులకు వేవేల దండాలంటూ ఆస్పత్రుల్లో హెలికాప్టర్ల ద్వారా వాయుసేన పూలవర్షం కురిపించడం మనందరికీ తెలుసు. హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రితో పాటు విశాఖలోని కోవిడ్ ఆస్పత్రిపై కూడా హెలికాప్టర్ల ద్వారా పూలవర్షం కురిపించాయి.
tags: doctors, flowers, gandhi hospital, chiranjeevi, twitter