మీడియాపై చిరు ఫైర్.. మీ వల్లే అంటూ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: ‘మా’ ఎన్నికల్లో ఓటేసిన మెగాస్టార్ చిరంజీవి..అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయని, మా ఎన్నికల్లో రచ్చ జరగడానికి మీడియానే కారణమని ఫైర్ అయ్యారు. మీడియాకు మంచి మెటీరియల్ దొరికిందని వ్యాఖ్యానించారు. ఇంత వేడి రగలడం మంచిది కాదని, ఎప్పుడు ఒకేలాగా అన్ని పరిస్థితులు ఉండవన్నారు. ఒక్కోసారి పరిస్థితులు మారతాయని అందుకు అనుగుణంగా సమాయత్తం కావాలని సూచించారు. ఎన్నికల్లో ఓటర్లు ఏం కోరుకుంటున్నారో అదే జరుగుతుందని చిరు తెలిపారు. కళాకారులు ఎవర్ని ఎన్నుకుంటే వారికే […]

Update: 2021-10-09 22:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: ‘మా’ ఎన్నికల్లో ఓటేసిన మెగాస్టార్ చిరంజీవి..అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయని, మా ఎన్నికల్లో రచ్చ జరగడానికి మీడియానే కారణమని ఫైర్ అయ్యారు. మీడియాకు మంచి మెటీరియల్ దొరికిందని వ్యాఖ్యానించారు. ఇంత వేడి రగలడం మంచిది కాదని, ఎప్పుడు ఒకేలాగా అన్ని పరిస్థితులు ఉండవన్నారు. ఒక్కోసారి పరిస్థితులు మారతాయని అందుకు అనుగుణంగా సమాయత్తం కావాలని సూచించారు.

ఎన్నికల్లో ఓటర్లు ఏం కోరుకుంటున్నారో అదే జరుగుతుందని చిరు తెలిపారు. కళాకారులు ఎవర్ని ఎన్నుకుంటే వారికే తన మద్దతు అని చెప్పారు. వ్యక్తిగతంగా ఒకరికి మద్దతిచ్చి ఎన్నికలను ప్రభావితం చేయడానికి సిద్ధంగా లేనన్నారు. అంతరాత్మ ప్రభోధానికి అనుసరించి ఓటు వేశానని చిరు పేర్కొన్నారు.

Tags:    

Similar News