మూడో విడత ‘సిసిసి’ సహాయం
లాక్‌డౌన్ సమయంలో కరోనా క్రైసిస్ చారిటీ ద్వారా సినీ కార్మికులను ఆదుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. కొవిడ్ మహమ్మారి కారణంగా ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్న వర్కర్ల ఇంటికే నిత్యావసర సరుకులు పంపించి ఆకలి బాధను తీర్చారు. ఇప్పటికే రెండు సార్లు సరుకులు పంపిణీ చేసిన చారిటీ.. మూడో విడత కూడా నిత్యావసర సరుకులు అందించనున్నట్లు తెలుపుతూ ట్వీట్ చేశాడు చిరు. ఈ వినాయక చవితి మరింత సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పరిస్థితులు మామూలు అయ్యే రోజు […]
లాక్‌డౌన్ సమయంలో కరోనా క్రైసిస్ చారిటీ ద్వారా సినీ కార్మికులను ఆదుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. కొవిడ్ మహమ్మారి కారణంగా ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్న వర్కర్ల ఇంటికే నిత్యావసర సరుకులు పంపించి ఆకలి బాధను తీర్చారు. ఇప్పటికే రెండు సార్లు సరుకులు పంపిణీ చేసిన చారిటీ.. మూడో విడత కూడా నిత్యావసర సరుకులు అందించనున్నట్లు తెలుపుతూ ట్వీట్ చేశాడు చిరు. ఈ వినాయక చవితి మరింత సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
పరిస్థితులు మామూలు అయ్యే రోజు మరింత దగ్గర్లోనే ఉందన్న చిరు..కరోనా పట్ల నిర్లక్ష్యంగా ఉండరాదన్నరు. అలాగని భయాందోళనకు గురి కావాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. మీ కుటుంబానికి ఇప్పుడు కావాల్సింది మీ ఆరోగ్యం అన్న చిరు.. మీ వల్ల మీ కుటుంబం బాధపడకూడదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉంటూ మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ మీ ఆప్తులను రక్షించుకోవాలని..మీ కుటుంబానికి రక్షనకవచంగా ఉండాలని కోరారు. కరోనా పరిస్థితులు పోయి.. అందరం కలిసి పని చేసుకుని సంతోషంగా ఉండే రోజు రావాలని ఆ గణేశుడికి ప్రార్థనలు చేద్దాం అన్నారు చిరు.
కరోనా క్రైసిస్ ఛారిటీ నుంచి మూడో విడత కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాం. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ వినాయక చవితి పండుగ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను – Megastar #Chiranjeevi @KChiruTweets pic.twitter.com/s6szHIlVDG
— BARaju (@baraju_SuperHit) August 21, 2020