చింతా ప్రభాకర్​ పార్టీకి దూరం.. మంత్రి హరీష్​రావు బుజ్జగింపులు

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: అలిగి కార్యక్రమాలకు దూరంగా ఉన్న సంగారెడ్డి  మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్​ను మంత్రి హరీష్​రావు బుజ్జగించారు. చింతా ప్రభాకర్​ పార్టీ మారే యోచనలో ఉన్నట్లు ‘దిశ’లో వచ్చిన కథనం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. పార్టీ వర్కింగ్​ కల్వకుంట్ల తారకరావు సంగారెడ్డి పర్యటన, చింతా ప్రభాకర్​ అలకకు కారణమైన విషయం తెలిసిందే. తనతో పాటు పార్టీ శ్రేణుల ముందే మంత్రి కేటీఆర్​ జగ్గారెడ్డిని పొగడడం, మా ఎంపీ, ఎమ్మెల్యేలను బాగా చూసుకో.. జగ్గన్న […]

Update: 2021-12-22 06:06 GMT

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: అలిగి కార్యక్రమాలకు దూరంగా ఉన్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్​ను మంత్రి హరీష్​రావు బుజ్జగించారు. చింతా ప్రభాకర్​ పార్టీ మారే యోచనలో ఉన్నట్లు ‘దిశ’లో వచ్చిన కథనం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. పార్టీ వర్కింగ్​ కల్వకుంట్ల తారకరావు సంగారెడ్డి పర్యటన, చింతా ప్రభాకర్​ అలకకు కారణమైన విషయం తెలిసిందే. తనతో పాటు పార్టీ శ్రేణుల ముందే మంత్రి కేటీఆర్​ జగ్గారెడ్డిని పొగడడం, మా ఎంపీ, ఎమ్మెల్యేలను బాగా చూసుకో.. జగ్గన్న అనడాన్ని ప్రభాకర్​ తప్పుపట్టారు. అయినా ప్రతిపక్ష ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలను బాగా చూసుకోవడం ఏమిటి..? ఈ మాటలు దేనికి సంకేతం. ఇవే మాటలు చింతతో పాటు పార్టీ శ్రేణుల్లో ఆగ్రహాన్ని పుట్టించాయి.

ఈ క్రమంలోనే చింతా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. భవిష్యత్ కార్యచరణపై సన్నిహితులతో చర్చిస్తున్నట్లు ‘దిశ’ కథనంలో వెల్లడించిన విషయం తెలిసిందే. చింతా ప్రభాకర్​ అలిగి, పార్టీ మారే యోచనలో ఉన్న విషయం తెలుసుకున్న మంత్రి హరీష్​రావు ఆయనకు ఫోన్​ చేసినట్లు తెలిసింది. దీంతో బుధవారం ఉదయం జిల్లాకు చెందిన నాయకులతో కలిసి ప్రభాకర్​ మంత్రి వద్దకు వెళ్లారు. ఉద్యమ సమయం నుంచి ఉంటున్న నీకు పార్టీ అండగా ఉంటుందని హరీష్​రావు భరోసా ఇచ్చినట్లు తెలిసింది. ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని మంత్రి సూచించారు. సంగారెడ్డిలో పార్టీకి పెద్ద దిక్కు మీరేనని, నాయకులు, కార్యకర్తలతో కలిసి పనిచేయాలని సూచించారు. టెన్షన్​ వద్దు చింతా..నేనున్నా అని మంత్రి హరీష్​రావు ప్రభాకర్​కు భరోసా ఇచ్చి పంపించినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. కాగా మరో సారి చింతా ప్రభాకర్ గురువారం మంత్రి హరీష్ రావును కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..