అలా చేస్తేనే గుడిలపై దాడులు జరగవు: చినజీయర్ స్వామి

దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లా నెలిమర్లలో ఇటీవల దుండగుల దాడికి గురైన రామతీర్థం ప్రధాన ఆలయాన్ని చినజీయర్ స్వామి దర్శించుకున్నారు. అనంతరం కొండపై దాడి ఘటనా స్థలాన్ని పరిశీలించి.. ఆలయ అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే, ఏడాది లోపు రామతీర్థం ఆలయ నిర్మాణం పూర్తి కావాలని చెప్పారు. ఈ సందర్భంగా చిన జీయర్ స్వామి మాట్లాడుతూ.. రామతీర్థం ఆలయ నిర్మాణానికి ఆగమ శాస్త్ర సూచనలు చేశామన్నారు. రాష్ట్రంలో ప్రతీ ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్నారు. భక్తులు నిత్యం […]

Update: 2021-01-14 06:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లా నెలిమర్లలో ఇటీవల దుండగుల దాడికి గురైన రామతీర్థం ప్రధాన ఆలయాన్ని చినజీయర్ స్వామి దర్శించుకున్నారు. అనంతరం కొండపై దాడి ఘటనా స్థలాన్ని పరిశీలించి.. ఆలయ అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే, ఏడాది లోపు రామతీర్థం ఆలయ నిర్మాణం పూర్తి కావాలని చెప్పారు. ఈ సందర్భంగా చిన జీయర్ స్వామి మాట్లాడుతూ.. రామతీర్థం ఆలయ నిర్మాణానికి ఆగమ శాస్త్ర సూచనలు చేశామన్నారు. రాష్ట్రంలో ప్రతీ ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్నారు. భక్తులు నిత్యం వచ్చేలా తీర్చిదిద్దితే.. రామతీర్థం లాంటి ఘటనలు చోటుచేసుకోవని హితవు పలికారు.

Tags:    

Similar News