‘దుర్గామాత కాళ్ల వద్ద జిన్‌పింగ్ తల’

దిశ, వెబ్‌డెస్క్: భారత సరిహద్దులో విస్తరణ వాదంతో ముందుకొచ్చిన చైనా బలగాలు దాడికి దిగడంతో ఇండియన్ ఆర్మీ గాల్వాన్ లోయ వద్ద తిప్పి కొట్టిన సంగతి ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. కానీ, ఈ ఘర్షణలో భారత సైనికులు సైతం అమర వీరులైయ్యారు. దీంతో యావద్ దేశం ఆగ్రహంతో ఊగిపోయింది. చైనాకు గట్టి బుద్ధి చెప్పాలని డిమాండ్ రావడంతో.. చైనా అహంకార చర్యలను ఖండించేందు కేంద్ర ప్రభుత్వం యాప్‌లను నిషేధించింది. ఇక ఇదే ప్రతికారాన్ని […]

Update: 2020-10-24 09:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత సరిహద్దులో విస్తరణ వాదంతో ముందుకొచ్చిన చైనా బలగాలు దాడికి దిగడంతో ఇండియన్ ఆర్మీ గాల్వాన్ లోయ వద్ద తిప్పి కొట్టిన సంగతి ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. కానీ, ఈ ఘర్షణలో భారత సైనికులు సైతం అమర వీరులైయ్యారు. దీంతో యావద్ దేశం ఆగ్రహంతో ఊగిపోయింది. చైనాకు గట్టి బుద్ధి చెప్పాలని డిమాండ్ రావడంతో.. చైనా అహంకార చర్యలను ఖండించేందు కేంద్ర ప్రభుత్వం యాప్‌లను నిషేధించింది.

ఇక ఇదే ప్రతికారాన్ని భారతీయులు వారికి నచ్చిన రీతిలో తీర్చుకుంటున్నారు. దసరా పండుగలో దుర్గామాత చేతిలో హతమైన రాక్షసుడిగా చైనా అధ్యక్షుడి బొమ్మను రూపొందించారు. అమ్మవారి కాళ్ల వద్ద తలను మొండంను వేరు చేసిన రాక్షస బొమ్మను పెట్టారు. బెంగాల్‌లోని బైర్హంపూర్‌లో ఇటువంటి విగ్రహాన్ని మండపంలో పెట్టారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చైనాకు ఇలా కూడా బుద్ధి చెప్పొచ్చు అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News