లాక్‌డౌన్ వేళ.. 100 కిలోల బరువు పెరిగిన చైనీయుడు
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా చాలా దేశాల్లో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పేదలు, వలస జీవులు ఎంతో ఇబ్బందిపడ్డ మాట వాస్తవమే. అయితే.. మధ్య తరగతి నుంచి సెలబ్రిటీ ఫ్యామిలీస్ వరకు చాలా మంది కరోనా లాక్‌డౌన్ వేళ.. ఆహారానికి చాలా ప్రాముఖ్యతనిచ్చారు. అందరూ ఇంట్లోనే ఉండటంతో.. చిరుతిళ్లు, తినుబండారాలపై ఫోకస్ పెట్టారు. చిన్న దుకాణాల నుంచి సూపర్ మార్కెట్ల వరకు బిస్కెట్లు, చాక్లెట్లు, నూడిల్స్, పీనట్స్, చిక్కీస్, చిప్స్ ఇలా చాలా […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా చాలా దేశాల్లో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పేదలు, వలస జీవులు ఎంతో ఇబ్బందిపడ్డ మాట వాస్తవమే. అయితే.. మధ్య తరగతి నుంచి సెలబ్రిటీ ఫ్యామిలీస్ వరకు చాలా మంది కరోనా లాక్‌డౌన్ వేళ.. ఆహారానికి చాలా ప్రాముఖ్యతనిచ్చారు. అందరూ ఇంట్లోనే ఉండటంతో.. చిరుతిళ్లు, తినుబండారాలపై ఫోకస్ పెట్టారు. చిన్న దుకాణాల నుంచి సూపర్ మార్కెట్ల వరకు బిస్కెట్లు, చాక్లెట్లు, నూడిల్స్, పీనట్స్, చిక్కీస్, చిప్స్ ఇలా చాలా ఫుడ్ ఐటెమ్స్ స్టాక్ లేకుండా అయిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలానే చైనాకు చెందిన ఓ ఫుడీ.. జనవరి మొదలు ఐదు నెలల పాటు పుష్టిగా తిన్నాడు. బయటకు వెళ్లే పని కూడా లేదాయే! దీంతో ఆ భారీకాయుడు కాస్త.. మహా భారీకాయుడు అయిపోయాడు. ఏకంగా 100 కిలోల బరువు పెరిగాడు. దాంతో వైద్యుల్ని సంప్రదించాడు.
వైరస్ పుట్టిల్లు వూహాన్‌కు చెందిన 26 ఏళ్ల ‘జౌ’ లాక్‌డౌన్‌కు ముందు 180 కిలోల బరువుండేవాడు. లోకల్ కేఫ్‌లో పనిచేస్తుండే ‘జౌ’.. ప్రతిరోజు వెయిట్ చెక్ చేసుకునేవాడు. కానీ కరోనా వైరస్ వ్యాప్తితో వూహాన్‌లో జనవరి నుంచి లాక్‌డౌన్ విధించడంతో ఇంటికే పరిమితమయ్యాడు. ఐదు నెలలుగా ఇంట్లోనే ఉండి తింటూనే ఉండటంతో క్రమంగా పెరుగుతూ.. 280 కిలోలకు చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో పడుకునేందుకు సైతం ఇబ్బంది తలెత్తడంతో 48 గంటల పాటు నిద్ర కూడా పోలేదు. దాంతో భరించలేక వైద్యుల్ని సంప్రదించాడు. వూహాన్ యూనివర్సిటీకి చెందిన ‘ఒబెసిటీ అండ్ మెటబాలిక్ సర్జరీ సెంటర్ ఆఫ్ ది సెంట్రల్ సౌత్’ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడు. అతనికి టెస్టులు చేయగా.. హార్ట్ ఫెయిల్యూర్, రెస్పిటరీ డిస్‌ఫంక్షన్ సింప్టమ్స్ బయటపడ్డాయి. జౌ హెవీ బాడీ వల్ల బ్లడ్ ప్రెజర్, ఈఈజీ టెస్టులు చేయలేకపోయారు. కాగా, జూన్ 11న అతడు అవుట్ ఆఫ్ డేంజర్ అని వైద్యులు ప్రకటించారు. తాము చెప్పిన డైట్ పాటించి, దాదాపు 60 కిలోల వరకు జౌ బరువు తగ్గితే.. గాస్ట్రిక్ బైపాస్ సర్జరీ ద్వారా మరింత బరువు తగ్గించవచ్చని డాక్టర్లు తెలిపారు.