అమెరికాకు 1000 వెంటిలేటర్లు అందిస్తున్న చైనా!
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాకు చైనా ఆపన్న హస్తం అందించింది. ఒక వైపు కరోనా కేసులు రెండు లక్షలు దాటగా.. మరోవైపు రక్షణ పరికరాలు, వెంటిలేటర్లు లేక అమెరికా సతమతమవుతున్నది. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలో కరోనా కేసు లక్ష దాటాయి. వెంటిలేటర్ల కోసం ఈ రాష్ట్రం.. ఫెడరల్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది ఇటువంటి ఆపత్కాలంలో చైనా 1000 వెంటిలేటర్లను న్యూయార్కు అందించేందుకు సిద్ధమైంది. త్వరలో వాటిని జాన్ఎఫ్ కెడీ విమానాశ్రయానికి తరలించనుంది. ఈ నిర్ణయంపై న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ […]
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాకు చైనా ఆపన్న హస్తం అందించింది. ఒక వైపు కరోనా కేసులు రెండు లక్షలు దాటగా.. మరోవైపు రక్షణ పరికరాలు, వెంటిలేటర్లు లేక అమెరికా సతమతమవుతున్నది. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలో కరోనా కేసు లక్ష దాటాయి. వెంటిలేటర్ల కోసం ఈ రాష్ట్రం.. ఫెడరల్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది ఇటువంటి ఆపత్కాలంలో చైనా 1000 వెంటిలేటర్లను న్యూయార్కు అందించేందుకు సిద్ధమైంది. త్వరలో వాటిని జాన్ఎఫ్ కెడీ విమానాశ్రయానికి తరలించనుంది. ఈ నిర్ణయంపై న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కుమో స్పందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆపత్కాలంలో చైనా సహాయం మరువలేనిదని, ఈ సహాయం తమకు ఎంతో విలువైనదని చెప్పారు.
Tags: Ventilators, china, donate, america, shortage, newyow