భారీగా యుద్ధ సామగ్రి మోహరించిన చైనా
దిశ, వెబ్ డెస్క్: భారత్ చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. పాంగాంగ్ కు భారీగా బలగాలను తరలించింది చైనా. ఫింగర్-3 వద్ద కొత్త స్థావరాలను ఏర్పాటు చేసింది. ఆయుధాలు, 150 యుద్ధవిమానాలు, బాలిస్టిక్ క్షిపణులు, రాకెట్లను మోహరించింది. తూర్పు లద్దాఖ్ లో 50వేల మంది సైనికులను దించింది. ఇటు భారత్ కూడా సరిహద్దు ప్రాంతాల్లో అదనపు బలగాల్ని మోహరించింది. ఎత్తైన ప్రాంతాలపై మన సైన్యంపాగా వేసింది. సుఖోయ్, మిగ్ యుద్ధ విమానాలతో చక్కర్లు కొడుతోంది. […]
దిశ, వెబ్ డెస్క్: భారత్ చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. పాంగాంగ్ కు భారీగా బలగాలను తరలించింది చైనా. ఫింగర్-3 వద్ద కొత్త స్థావరాలను ఏర్పాటు చేసింది. ఆయుధాలు, 150 యుద్ధవిమానాలు, బాలిస్టిక్ క్షిపణులు, రాకెట్లను మోహరించింది. తూర్పు లద్దాఖ్ లో 50వేల మంది సైనికులను దించింది.
ఇటు భారత్ కూడా సరిహద్దు ప్రాంతాల్లో అదనపు బలగాల్ని మోహరించింది. ఎత్తైన ప్రాంతాలపై మన సైన్యంపాగా వేసింది. సుఖోయ్, మిగ్ యుద్ధ విమానాలతో చక్కర్లు కొడుతోంది. రెజాంగ్ లా దగ్గర 5 వేల మీటర్ల ఎత్తున భారత్ శిబిరాలు ఏర్పాటు చేసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమంటోంది భారత్ ఆర్మీ.