అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా ఊరు

న్యూఢిల్లీ: డ్రాగన్ కంట్రీ చైనా కవ్వింపు చర్యలు ఆపడం లేదు. ఒకవైపు లడాఖ్‌లో కయ్యానికి దిగగా, మరోవైపు ఈశాన్య రాష్ట్రం అరుణాల్‌ప్రదేశ్‌లో ఏకంగా ఒక ఊరినే నిర్మించింది. సరిహద్దుకు ఇటువైపున సుమారు 4.5 కిలోమీటర్ల భారత భూభాగం లోపల 101 ఇండ్లను నిర్మించినట్టు శాటిలైట్ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. అధికారిక మ్యాపుల ప్రకారం ఈ ప్రాంతం భారత భూభాగానికి చెందినదైనప్పటికీ 1959 నుంచి చైనా నియంత్రణలో ఉంటున్నది. గతంలో ఇక్కడ ఒక్క మిలిటరీ పోస్టు ఉండగా ఇప్పుడు ఏకంగా […]

Update: 2021-01-18 10:47 GMT

న్యూఢిల్లీ: డ్రాగన్ కంట్రీ చైనా కవ్వింపు చర్యలు ఆపడం లేదు. ఒకవైపు లడాఖ్‌లో కయ్యానికి దిగగా, మరోవైపు ఈశాన్య రాష్ట్రం అరుణాల్‌ప్రదేశ్‌లో ఏకంగా ఒక ఊరినే నిర్మించింది. సరిహద్దుకు ఇటువైపున సుమారు 4.5 కిలోమీటర్ల భారత భూభాగం లోపల 101 ఇండ్లను నిర్మించినట్టు శాటిలైట్ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. అధికారిక మ్యాపుల ప్రకారం ఈ ప్రాంతం భారత భూభాగానికి చెందినదైనప్పటికీ 1959 నుంచి చైనా నియంత్రణలో ఉంటున్నది. గతంలో ఇక్కడ ఒక్క మిలిటరీ పోస్టు ఉండగా ఇప్పుడు ఏకంగా వేలమంది నివసించడానికి అనువైన ఒక ఊరే వెలిసింది. ఈ ఊరు సారి చూ సరస్సు పక్కన ఎగువ సుబాన్‌సిరి జిల్లాలో ఉన్నది.

ఈ చిత్రాలు భారత్‌ను ఆందోళనపరుస్తున్నట్టు నిపుణులు అభిప్రాయపడ్డారు. గతేడాది నవంబర్ 1వ తేదీన తీసిన శాటిలైట్ చిత్రాల్లో ఈ ఊరు కనిపించింది. 26 ఆగస్టు, 2019లో ఈ ఊరు ఆనవాళ్లు లేవు. అంటే గతేడాదే ఈ ఊరిని చైనా నిర్మించి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ వార్తలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ‘భారత సరిహద్దులో చైనా నిర్మాణాలను గమనిస్తున్నాం. గత కొన్నేళ్లుగా చైనా ఇలాంటి కార్యకలాపాలు చేస్తూనే ఉన్నది. భారత్ కూడా సరిహద్దులో స్థానికుల కోసం రోడ్లు, బ్రిడ్జీలు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణాలు చేపడుతుంది’ అని తెలిపింది. ఈ గ్రామంపై దౌత్య విధానంలో చైనా ముందుకు తీసుకెళ్లారా? అని ప్రశ్నించగా, ‘ఇలాంటి కార్యకలాపాలన్నింటినీ భారత్ గమనిస్తున్నది. దేశ సార్వభౌమత్వం, సమగ్రత కోసం అవసరమైన చర్యలన్నీ తీసుకుంటాం’ అని వివరించింది.

Tags:    

Similar News