చైనాలో మండుతున్న ధరలు!
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో చైనాలో ఆహార ధరలు ఆకాశాన్నంటాయి. ఫిబ్రవరి నెలలో కరోనాను నిరోధించే చర్యలను చైనా వేగవంతం చేసిన తర్వాత పంపిణీలపై ప్రభావం అధికంగా ఉంది. పైగా చైనాలో చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. చమురు ప్రభావం కూడా ఆహార ధరలపై పడ్డాయి. గతేడాదితో పోల్చితే చైనాలో ఆహార ధరలు 21 శాతానికి పైగా పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇక, చమురు ధరలు ఏడాది కాలంలో 5.2 శాతం పెరిగాయి. తాజా […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో చైనాలో ఆహార ధరలు ఆకాశాన్నంటాయి. ఫిబ్రవరి నెలలో కరోనాను నిరోధించే చర్యలను చైనా వేగవంతం చేసిన తర్వాత పంపిణీలపై ప్రభావం అధికంగా ఉంది. పైగా చైనాలో చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. చమురు ప్రభావం కూడా ఆహార ధరలపై పడ్డాయి. గతేడాదితో పోల్చితే చైనాలో ఆహార ధరలు 21 శాతానికి పైగా పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇక, చమురు ధరలు ఏడాది కాలంలో 5.2 శాతం పెరిగాయి. తాజా కూరగాయల ధరలు గత ఏడాదితో పోలిస్తే 9.5 శాతం పెరిగాయని లెక్కలు చెబుతున్నాయి.
జనవరి నుంచి వూహాన్ నగరానికి రాకపోకలను నిలిపేయగానే భయాందోళనతో మార్కెట్లలో కొనుగోళ్లు ఎక్కువయ్యాయి. ఆ పరిణామాలతో అన్ని రకాల ఆహార ధరలు పెరిగాయి. ధరల పెరుగుదలపై చైనా ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పటికీ ప్రయాణాల ఆంక్షల కారణంగా సరుకుల రవాణాకు అడ్డంకిగా మారాయి. వెంటనే చైనా ప్రభుత్వం ధరలను తగ్గించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేసింది. అందులో భాగంగా రైతులకు సబ్సీడీలు అందించడం, ఇంకా ఇతర రకాల సాయాన్ని అందిస్తోంది.