ట్రయల్స్ దశ వాక్సిన్లను వాడుతున్నాం: చైనా
దిశ, వెబ్‌డెస్క్: చైనాలో మొదలైన కరోనా ప్రపంచాన్ని చుట్టేసింది. వైరస్ నియంత్రణకు చైనా వాక్సిన్ తయారీలపై ప్రయోగాలు మొదలు పెట్టింది. అయితే ట్రయల్స్ దశలోనే ఉన్న వాక్సిన్‌లను అత్యవసరంగా బోర్డర్ అధికారులకు, వైద్యులకు అందజేశారు. ఈ విషయాన్ని నేషనల్ హెల్త్ కమిషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంట్ అధిపతి జంగ్ జంగ్ వెన్ వెల్లడించారు. ఇతర దేశాల నుంచి వస్తున్న వ్యక్తుల కారణంగా చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నదని..దీంతో వాక్సిన్లను బోర్డర్ అధికారులకు అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. […]
దిశ, వెబ్‌డెస్క్: చైనాలో మొదలైన కరోనా ప్రపంచాన్ని చుట్టేసింది. వైరస్ నియంత్రణకు చైనా వాక్సిన్ తయారీలపై ప్రయోగాలు మొదలు పెట్టింది. అయితే ట్రయల్స్ దశలోనే ఉన్న వాక్సిన్‌లను అత్యవసరంగా బోర్డర్ అధికారులకు, వైద్యులకు అందజేశారు. ఈ విషయాన్ని నేషనల్ హెల్త్ కమిషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంట్ అధిపతి జంగ్ జంగ్ వెన్ వెల్లడించారు. ఇతర దేశాల నుంచి వస్తున్న వ్యక్తుల కారణంగా చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నదని..దీంతో వాక్సిన్లను బోర్డర్ అధికారులకు అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. ట్రయల్స్ దశలోనే ఉన్న వాక్సిన్‌లను చికిత్సకు వాడుతున్నట్లు ప్రకటించిన తొలి దేశం చైనానే కావడం గమనార్హం.