చైనాలో శాంతించిన కరోనా..
చైనాలోని వుహాన్ నగరంలో పుట్టి ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19(కరోనా) వైరస్ ఇప్పడు ఆ దేశంలో శాంతిస్తున్నట్టు తెలుస్తోంది. గడచిన 24గంటల్లో చైనాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ఆ దేశ వైద్య ఆరోగ్య కమిషన్ వెల్లడించింది.అన్ని ప్రధాన నగరాల్లో కరోనాపై అవగాహనా కార్యక్రమాలు చేపట్టడం, అనుమానిత వ్యక్తులను వెంటనే ఐసోలేషన్ సెంటర్లకు తరలించి చికిత్సను అందించడం ద్వారా ఈ వైరస్ ప్రభావం కొంత మేర తగ్గినట్టు తెలుస్తోంది. వుహాన్ నగరంలో కూడా కరోనా […]
చైనాలోని వుహాన్ నగరంలో పుట్టి ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19(కరోనా) వైరస్ ఇప్పడు ఆ దేశంలో శాంతిస్తున్నట్టు తెలుస్తోంది. గడచిన 24గంటల్లో చైనాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ఆ దేశ వైద్య ఆరోగ్య కమిషన్ వెల్లడించింది.అన్ని ప్రధాన నగరాల్లో కరోనాపై అవగాహనా కార్యక్రమాలు చేపట్టడం, అనుమానిత వ్యక్తులను వెంటనే ఐసోలేషన్ సెంటర్లకు తరలించి చికిత్సను అందించడం ద్వారా ఈ వైరస్ ప్రభావం కొంత మేర తగ్గినట్టు తెలుస్తోంది. వుహాన్ నగరంలో కూడా కరోనా అనుమానిత కేసులు తగ్గుముఖం పట్టినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి.కాగా, వైరస్ వెలుగులోకి వచ్చిన చోట కేసులు తగ్గుతుంటే ఆసియా,యూరప్ దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. మరణాల సంఖ్య కూడా పెరుతున్నట్టు తెలుస్తోంది.
Tags: china, carona, decrease cases in china, europ and asia countries, medical counsil