చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడికి అరుదైన పురస్కారం

దిశ, చేవెళ్ల : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ ఎం.డీ సౌందరరాజన్‌కు ‘సంప్రదాయ సంరక్షణ దీపం’ అనే అరుదైన పురస్కారాన్ని అందుకున్నారు. శ్రీరంగ క్షేత్రంలో వెలసిన పౌండరీక పురం అండమాన్ ఆశ్రమం అనే సంస్థ సౌందరరాజన్‌కు సంప్రదాయ పరిరక్షణ కోసం చేసిన కృషిని గుర్తిస్తూ ఈ అవార్డును బహుకరించింది.శ్రీ శ్రీ గోపాల దేశిక మహాదేశికన్ స్వామివారి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ పురస్కారాన్ని సౌందరరాజన్‌కు ఒక కొరియర్ ద్వారా […]

Update: 2021-05-28 05:06 GMT

దిశ, చేవెళ్ల : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ ఎం.డీ సౌందరరాజన్‌కు ‘సంప్రదాయ సంరక్షణ దీపం’ అనే అరుదైన పురస్కారాన్ని అందుకున్నారు. శ్రీరంగ క్షేత్రంలో వెలసిన పౌండరీక పురం అండమాన్ ఆశ్రమం అనే సంస్థ సౌందరరాజన్‌కు సంప్రదాయ పరిరక్షణ కోసం చేసిన కృషిని గుర్తిస్తూ ఈ అవార్డును బహుకరించింది.శ్రీ శ్రీ గోపాల దేశిక మహాదేశికన్ స్వామివారి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ పురస్కారాన్ని సౌందరరాజన్‌కు ఒక కొరియర్ ద్వారా పంపించినట్లు ఆయన తెలిపారు. పండరీపురం అండమాన్ ఆశ్రమానికి ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శ్రీనివాస మహాదేశికన్ గారి దివ్య ఆశీస్సులతో ఈ బిరుదు పత్రము, నాలుగు వేల రూపాయల నగదు పురస్కారాన్ని పంపించినట్లు సమాచారం.

డాక్టర్ ఎంవీ ఎస్ అని ప్రేమతో పిలువబడే సౌందరరాజన్ ఎంకామ్, ఎల్ఎల్‌బీ పట్టభద్రులు. కామర్స్‌లో డాక్టరేట్ పట్టా పొందారు. చిలుకూరు బాలాజీ దేవాలయం కేంద్రంగా ఆలయాల పరిరక్షణ ఉద్యమం నడిపిస్తూ దేవాలయాలపై ప్రభుత్వ జోక్యాన్ని బెదిరిస్తూ దేవాదాయ చట్ట సవరణకు ఎంతో కృషి చేసిన వ్యక్తి అని కొనియాడారు. జస్టిస్ రమా జాయిస్ ఆధ్వర్యంలోని దేవాదాయ చట్ట సవరణ కమిటీ కర్ణాటకలో ఏర్పడగా ఆ కమిటీ ముందు తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేసినట్లు తెలిపారు.

దాని ఫలితమే ధార్మిక పరిషత్ ఏర్పాటు అనే అంశాన్ని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ చట్ట సవరణలో చట్ట బద్ధం కూడా చేయగలిగారు. ఉన్నత న్యాయస్థానాల్లో, సుప్రీంకోర్టులో ఎన్నో వ్యాజ్యాలలో ధర్మం వైపు న్యాయస్థానాలను నడిపించడంలో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. 2018లో జరిగిన ముని వాహన ఉత్సవం ఒక చారిత్రాత్మక మైన ఘట్టం అని దళిత భక్తుడిని అర్చకుడు భుజం భుజం పైన మోయడం అసామాన్యం.లాంటి ఒక ఘట్టాన్ని ముందుండి జియాగూడలోని రంగనాథ స్వామి గుడిలో జరిపించిన మహానుభావుడు సౌందర్య రాజన్‌కు అరుదైన పురస్కారం అందించి సత్కరించారు.

Tags:    

Similar News