ఈ లక్షణాలున్నా అనుమానించాల్సిందే

న్యూఢిల్లీ: ఇప్పటివరకూ దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం వంటివి మాత్రమే కరోనా లక్షణాలుగా పరిగణిస్తుండగా, తాజాగా, అమెరికాకు చెందిన వైద్య నిపుణులు మరో ఆరు లక్షణాలు కనిపించినా కరోనాగా అనుమానించాల్సిందేనంటున్నారు. యూఎస్, బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్తలు కరోనా రోగులను గుర్తించడానికి రూపొందించిన ‘సింప్టమ్ ట్రాకర్’ అనే యాప్‌ నుంచి సేకరించిన వివరాలను అధ్యయనం చేయగా, కొత్తగా మరో ఆరు లక్షణాలు బయటపడ్డాయి. అవి.. 1. చలి 2. చలితో తరచూ వణుకు రావడం […]

Update: 2020-04-28 01:18 GMT

న్యూఢిల్లీ: ఇప్పటివరకూ దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం వంటివి మాత్రమే కరోనా లక్షణాలుగా పరిగణిస్తుండగా, తాజాగా, అమెరికాకు చెందిన వైద్య నిపుణులు మరో ఆరు లక్షణాలు కనిపించినా కరోనాగా అనుమానించాల్సిందేనంటున్నారు. యూఎస్, బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్తలు కరోనా రోగులను గుర్తించడానికి రూపొందించిన ‘సింప్టమ్ ట్రాకర్’ అనే యాప్‌ నుంచి సేకరించిన వివరాలను అధ్యయనం చేయగా, కొత్తగా మరో ఆరు లక్షణాలు బయటపడ్డాయి.

అవి..

1. చలి
2. చలితో తరచూ వణుకు రావడం
3. కండరాల నొప్పులు
4. తలనొప్పి
5. గొంతులో మంట
6. రుచి, వాసన తెలియకపోవడం
ఈ లక్షణాలు కనిపించినా కరోనాగా అనుమానించాల్సిందేనని వారు హెచ్చరిస్తున్నారు. అమెరికా, బ్రిటన్ దేశాల్లో మార్చి నెల నుంచి నమోదైన పాజిటివ్ కేసుల్లో 50శాతం మందిలో వాసన, రుచి తెలియకపోవడం వంటి లక్షణాలే కనిపించాయని వెల్లడించారు. ప్రధానంగా ఈ రెండు లక్షణాలు కనిపించినట్టయితే, తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. వీటితో పాటు కాళ్లు వాపు రావడం, కాలి వేళ్లు నీలి రంగులోకి మారడం, పాలిపోవడం వంటి లక్షణాలూ కోవిడ్ 19 రోగుల్లో గుర్తించినట్టు ఇటలీకి చెందిన డెర్మటాలజిస్టులు చెబుతున్నారు.

Tags: chills, headache, muscle pain, US experts, six new symptoms for coronavirus, corona, covid 19, britain, us

Tags:    

Similar News