చిన్నారుల నోటా ప్రతీకారం మాట..ఎవరితో అంటే

అలీగఢ్: లద్దాక్‌లోని గాల్వాన్ వ్యాలీ ఉదంతంలో మరణించిన తెలంగాణ అమర జవాన్ కల్నల్ సంతోష్ బాబుతో పాటు మరో ఇరవై మంది సైనికులను బలిగొన్న చైనా మీద రివేంజ్ కోసం భారతీయులందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చైనా, ఇండియా బార్డర్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరు దేశాలు సైన్యంతో పాటు యుద్ధ సామగ్రిని కూడా మోహరిస్తున్నారు. ఓ వైపు ఇరుదేశాల సైనిక ఉన్నతాధికారులు చర్చలు జరుపుతుంటే.. మరోవైపు పాటు బోర్డర్లో యుద్ధ సన్నాహాలు వేగంగా జరుగుతుంటం ఆందోళన కలిగిస్తున్నది.ఈ […]

Update: 2020-06-21 09:30 GMT

అలీగఢ్: లద్దాక్‌లోని గాల్వాన్ వ్యాలీ ఉదంతంలో మరణించిన తెలంగాణ అమర జవాన్ కల్నల్ సంతోష్ బాబుతో పాటు మరో ఇరవై మంది సైనికులను బలిగొన్న చైనా మీద రివేంజ్ కోసం భారతీయులందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చైనా, ఇండియా బార్డర్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరు దేశాలు సైన్యంతో పాటు యుద్ధ సామగ్రిని కూడా మోహరిస్తున్నారు. ఓ వైపు ఇరుదేశాల సైనిక ఉన్నతాధికారులు చర్చలు జరుపుతుంటే.. మరోవైపు పాటు బోర్డర్లో యుద్ధ సన్నాహాలు వేగంగా జరుగుతుంటం ఆందోళన కలిగిస్తున్నది.ఈ క్రమంలోనే ఉత్తర ప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన పదేండ్ల లోపు వయస్సున్న చిన్నారులు చైనా సరిహద్దుకు బయలుదేరారు. హైవే మీదుగా కాలినడకన వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకుని..ఎక్కడికి వెళ్తున్నారని అడుగగా చిన్నారులు చెప్పిన సమాధానం విని వారు ఆశ్చర్యపోయారు.

పోలీసులు పిల్లలను ఎక్కడికెళుతున్నారని అడిగినప్పుడు.. ‘చిన్ సే బాద్లా లేన్ జా రాహే హై., ఉస్నే హమారే జవానో కో మార్ డియా ( మేము చైనాపై ప్రతీకారం తీర్చుకోడానికి వెళ్తున్నాం, వారు మన సైనికులను చంపారు) ’ అని వారు బదులిచ్చారు. ఆ మాటలు విన్న పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మాతృభూమి పట్ల వారు కనబరిచిన ప్రేమను ప్రశంసించారు.

అనంతరం పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరి ఇంటికి వారు తిరిగి వెళ్లాలని చెప్పారు. రివేంజ్ మ్యాటర్ మన సైనికులు చూసుకుంటారని, మీరు ఇంట్లో ఉండి చదువులపై దృష్టి సారించండి అంటూ పోలీసులు సూచించారు.

Tags:    

Similar News