రామ‌ప్పలో హెరిటేజ్ వాక్‌.. ఆక‌ట్టుకున్న చిన్నారుల నృత్య ప్రద‌ర్శన‌లు

దిశ, రామప్ప: ప్రపంచ పర్యటన దినోత్సవాన్ని పురస్కరించుకొని రామప్ప ఆల‌య ప్రాంగ‌ణంలో హెరిటేజ్ వాక్ నిర్వహించారు. సాంస్కృతిక, శాస్త్రీయ నృత్య సంబరాలు అంబరానంటాయి. రామప్ప ఆలయం నుంచి గొల్ల గుడి వరకు పర్యాటకులతో టూరిజం శాఖ ఆధ్వర్యంలో జ‌రిగిన ఈ సంబ‌రాల్లో వివిధ జిల్లాల నుంచి వ‌చ్చిన చిన్నారులు, ప‌ర్యాట‌కులు హెరిటేజ్ వాక్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రామప్ప విశిష్టతను టూరిజం గైడ్‌లు వారికి వివరించారు. కూచిపూడి శాస్త్రీయ నృత్యం, జానపద నృత్యాలతో ప్రముఖ నృత్యకారిణి తాండూరు రేణుక […]

Update: 2021-09-26 07:40 GMT

దిశ, రామప్ప: ప్రపంచ పర్యటన దినోత్సవాన్ని పురస్కరించుకొని రామప్ప ఆల‌య ప్రాంగ‌ణంలో హెరిటేజ్ వాక్ నిర్వహించారు. సాంస్కృతిక, శాస్త్రీయ నృత్య సంబరాలు అంబరానంటాయి. రామప్ప ఆలయం నుంచి గొల్ల గుడి వరకు పర్యాటకులతో టూరిజం శాఖ ఆధ్వర్యంలో జ‌రిగిన ఈ సంబ‌రాల్లో వివిధ జిల్లాల నుంచి వ‌చ్చిన చిన్నారులు, ప‌ర్యాట‌కులు హెరిటేజ్ వాక్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రామప్ప విశిష్టతను టూరిజం గైడ్‌లు వారికి వివరించారు. కూచిపూడి శాస్త్రీయ నృత్యం, జానపద నృత్యాలతో ప్రముఖ నృత్యకారిణి తాండూరు రేణుక శిష్యబృందం చేసిన ప్రద‌ర్శన‌లు ఆక‌ట్టుకున్నాయి. అనంతరం గైడ్‌ల‌ను, ఫోటోగ్రాఫర్ శ్రావణ్, సర్పంచ్, అధికారులను మెమెంటో, శాలువాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ కోఆర్డినేషన్ చేయగా, ములుగు జిల్లా సబ్ రిజిస్టర్ తస్లీమా మహ్మద్, పాలంపేట గ్రామ సర్పంచ్ రజిత, టూరిజం అధికారులు కుసుమ సూర్య కిరణ్, లోకేష్, వంశీ కొమురయ్య, సిబ్బంది శరత్, సతీష్, ఖాదర్, రామప్ప దేవాలయం ఈవో శ్రీనివాస్, వెంకటాపూర్ మండల ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వెంకటాపూర్ ఎస్సై రమేష్ పర్యవేక్షణలో పోలీస్ శాఖ వారు బందోబస్తు నిర్వహించారు.

Tags:    

Similar News