చిన్నారిలో ధైర్యం నింపిన ‘జ్యోతిక’ మాటలు .. కామాంధుడికి ఐదేళ్ల జైలు

దిశ, సినిమా : ‘వినే టైమ్ చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది’అన్నట్లుగా హీరోయిన్ జ్యోతిక ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘పొన్‌మగల్ వందాళ్’ఓ చిన్నారిపై భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. తనను ఏళ్ల తరబడి లైంగికంగా హింసిస్తున్న కామాంధుడిని ఊచలు లెక్కబెట్టిస్తోంది. చెన్నై రాయపురంనకు చెందిన తొమ్మిదేళ్ల పాప సన్ టీవీలో ప్రసారమైన ‘పొన్‌మగల్ వందాళ్’ చిత్రాన్ని చూసి తనకు జరిగిన అన్యాయం గురించి ఓపెన్ అయింది. ఈ మూవీలోని కోర్టు సీన్‌లో ‘తల్లి దగ్గర […]

Update: 2021-09-25 22:27 GMT

దిశ, సినిమా : ‘వినే టైమ్ చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది’అన్నట్లుగా హీరోయిన్ జ్యోతిక ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘పొన్‌మగల్ వందాళ్’ఓ చిన్నారిపై భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. తనను ఏళ్ల తరబడి లైంగికంగా హింసిస్తున్న కామాంధుడిని ఊచలు లెక్కబెట్టిస్తోంది. చెన్నై రాయపురంనకు చెందిన తొమ్మిదేళ్ల పాప సన్ టీవీలో ప్రసారమైన ‘పొన్‌మగల్ వందాళ్’ చిత్రాన్ని చూసి తనకు జరిగిన అన్యాయం గురించి ఓపెన్ అయింది.

ఈ మూవీలోని కోర్టు సీన్‌లో ‘తల్లి దగ్గర ఏ విషయాన్ని దాచిపెట్టొద్దు’అనే డైలాగ్‌తో ఇన్‌స్పైర్ అయిన పాప.. సమీప బంధువు తనను లైంగికంగా వేధిస్తున్నట్లు తల్లికి వివరించింది. దీంతో వెంటనే తను పోలీసులను ఆశ్రయించగా.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడికి ఏడాదిలోపే శిక్ష పడేలా చర్యలు తీసుకున్నారు. దీంతో 48 ఏళ్ల నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష పడగా.. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేకాదు ఇలాంటి సినిమాను ఎంచుకున్న జ్యోతికపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Tags:    

Similar News