‘కరోనాతో బాల్య వివాహాలు పెరగొచ్చు’
– గ్లోబల్ చారిటీ సర్వేలో వెల్లడి రానున్న రెండేళ్లలో నలభై లక్షల మంది ఆడపిల్లలకు బాల్యవివాహాలు జరిగే అవకాశం ఉందని ఒక గ్లోబల్ చారిటీ తెలిపింది. ఇందుకు ప్రధాన కారణం కరోనా వైరస్ మహమ్మారి అని కూడా పేర్కొంది. ఈ సంక్షోభం కారణంగా ఆర్థిక సమస్యలు తలెత్తి పేదరికం పెరిగిపోతుందని, తద్వారా చాలా కుటుంబాల్లో ఆడపిల్లలకు త్వరగా పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఉంటారని వరల్డ్ విజన్ సంస్థ చేసిన సర్వేలో తెలిపింది. సాధారణంగా ఎలాంటి సంక్షోభాలు ఎదురైనా […]
– గ్లోబల్ చారిటీ సర్వేలో వెల్లడి
రానున్న రెండేళ్లలో నలభై లక్షల మంది ఆడపిల్లలకు బాల్యవివాహాలు జరిగే అవకాశం ఉందని ఒక గ్లోబల్ చారిటీ తెలిపింది. ఇందుకు ప్రధాన కారణం కరోనా వైరస్ మహమ్మారి అని కూడా పేర్కొంది. ఈ సంక్షోభం కారణంగా ఆర్థిక సమస్యలు తలెత్తి పేదరికం పెరిగిపోతుందని, తద్వారా చాలా కుటుంబాల్లో ఆడపిల్లలకు త్వరగా పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఉంటారని వరల్డ్ విజన్ సంస్థ చేసిన సర్వేలో తెలిపింది.
సాధారణంగా ఎలాంటి సంక్షోభాలు ఎదురైనా వాటి ప్రభావం పేదకుటుంబాల్లోని ఆడపిల్లల మీదే పడుతుందని చారిటీ చైల్డ్ మ్యారేజ్ నిపుణురాలు ఎరికా హాల్ తెలిపారు. ఇప్పుడే దీని గురించి ఆలోచించి ఏదో ఒక చర్య తీసుకోకపోతే పరిస్థితి చేజారిపోయే అవకాశం ఉందని కూడా ఆమె హెచ్చరించారు. లాక్‌డౌన్ కారణంగా ఆరోగ్య సేవలు అందుబాటులో లేకపోవడంతో టీనేజీ ప్రెగ్నెన్సీలు పెరిగి, పెళ్లికి తొందరపడే అవకాశాలు కూడా ఉన్నాయని ఈ సర్వేలో తేలింది. ప్రతి ఏట ప్రపంచ వ్యాప్తంగా 12 మిలియన్ల మంది అమ్మాయిలకు 18 ఏళ్లలోపే పెళ్లిళ్లు అవుతున్నాయి. అంటే ప్రతి మూడు సెకండ్లకు ఒక అమ్మాయికి బాల్యవివాహం జరుగుతోందన్నమాట.
యూఎన్ నివేదిక ప్రకారం పాండమిక్ కారణంగా మరో 13 మిలియన్ల మందికి.. వచ్చే దశాబ్దంలో బాల్యవివాహం జరగొచ్చని అంచనా వేసింది. ఈ వివాహాలు ఎక్కువగా ఇండియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో జరగవచ్చని, ఇదే జరిగితే తాము ఇన్నేళ్ల నుంచి చేస్తున్న కృషి వృథాగా పోతుందని బాల్యవివాహాలను వ్యతిరేకించే స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వీటితో పాటు తమకు సాయంగా నిలిచే పాఠశాలలు కూడా మూసివేసి ఉండటంతో వారు మరింత బాధపడుతున్నట్లు గర్ల్స్ నాట్ బ్రైడ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి మవాంగి పొవెల్ తెలిపారు.