ఇదే స్ఫూర్తి కొనసాగాలి : సీపీ సజ్జనార్‌

వృత్తిలో భాగంగా మహిళలు, చిన్నారుల రక్షణకు ఉత్తమ పనితీరు, ప్రతిభను కనబర్చిన షీ టీమ్స్, ఆపరేషన్ స్మైల్ టీమ్ సిబ్బందికి ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్‌ రివార్డులు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ సైబరాబాద్‌లో షీ టీమ్స్ ఆపరేషన్ స్మైల్ టీమ్స్ బాగా పనిచేస్తున్నాయన్నారు. ఆపరేషన్ స్మైల్, షీ టీమ్స్ తెలంగాణలో‌నే నెంబర్-1 స్థానంలో ఉందని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు. ఇటీవల మహిళలపై సైబర్ నేరాలు, ఆన్‌లైన్ వేధింపులు, […]

Update: 2020-02-16 07:34 GMT

వృత్తిలో భాగంగా మహిళలు, చిన్నారుల రక్షణకు ఉత్తమ పనితీరు, ప్రతిభను కనబర్చిన షీ టీమ్స్, ఆపరేషన్ స్మైల్ టీమ్ సిబ్బందికి ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్‌ రివార్డులు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ సైబరాబాద్‌లో షీ టీమ్స్ ఆపరేషన్ స్మైల్ టీమ్స్ బాగా పనిచేస్తున్నాయన్నారు. ఆపరేషన్ స్మైల్, షీ టీమ్స్ తెలంగాణలో‌నే నెంబర్-1 స్థానంలో ఉందని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు. ఇటీవల మహిళలపై సైబర్ నేరాలు, ఆన్‌లైన్ వేధింపులు, సైబర్ బుల్లీయింగ్/ ఆన్లైన్‌లో బెదిరింపులు, బ్లాక్ మెయిల్ చేయడం వంటి సంఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయని.. వీటిపై షీ టీం సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మహిళలు ఆన్‌లైన్‌లో డైబర్ బుల్లీయింగ్ బారిన పడకుండా షీ టీమ్స్ చైతన్యం కలిగించాలన్నారు. షీ టీమ్స్ భవిష్యత్ అవసరాల దృష్ట్యా అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. ముఖ్యంగా చిన్నారుల పట్ల జరుగుతున్న అకృత్యాల నివారణకు షీ టీమ్స్, బాలమిత్రలు, ఆపరేషన్ స్మైల్ టీమ్‌లు పని చేయాలన్నారు. రాత్రి వేళల్లో చీకటి ప్రదేశాలు నేరాలు జరిగేందుకు ఎక్కువగా ఆస్కారం ఉంటుందని, అటువంటి ప్రాంతాలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. బాల కార్మిక వ్యవస్థ లేని సమాజం రావాలన్నారు. పిల్లలను బాలకార్మికులుగా, యాచకులుగా, కాగితాలు ఏరుకునే పనులు చేయిస్తూ వారి బంగారు బాల్యాన్ని బుగ్గిపాలు చేస్తున్న తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ర్వహిస్తున్నామన్నారు. మాట వినని కొందరు తల్లిదండ్రులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసి, జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ అధికారులతో కలిసి చిన్నారులను సంరక్షిస్తున్నామన్నారు. రెస్క్యూ చేసిన చిన్నారులకు భోజనం, విద్య, వైద్యం వంటి అన్ని మౌలిక వసతులను కల్పిస్తున్నామని చెప్పారు. ఆపరేషన్ స్మైల్ లో భాగంగా రెస్క్యూ చేసిన పిల్లలు స్కూల్స్‌లో ఉన్నారా లేదా అనే విషయాన్ని ఫాలో అప్ చేసుకోవాలన్నారు. ఎక్కడైనా బాలకార్మికులుగాని, రోడ్డుపై, ట్రాఫిక్‌ కూడళ్లు, దేవాలయాలు, టూరిస్టు ప్రాంతాల్లో యాచిస్తున్న చిన్నారులు కనిపిస్తే వెంటనే సైబరాబాద్‌ ‘ఆపరేషన్‌ ముస్కాన్‌, స్మైల్‌ టీమ్‌ వాట్సాప్‌ నెంబర్‌ 7901115474, కమిషనరేట్‌ వాట్సాప్‌ నంబర్‌ 9490617444లకు సమాచారం ఇవ్వండి అన్నారు. డయల్‌ 100కు ఫోన్‌ చేసి కూడా చెప్పొచ్చు. అనంతరం విమెన్ అండ్ చిల్డ్రన్ ప్రొటెక్షన్ వింగ్ డీసీపీ షీ టీమ్స్ అనసూయ మాట్లాడుతూ… సైబరాబాద్ సీపీ సజ్జనార్ గారి సూచనల మేరకు షీ టీమ్స్, ఆపరేషన్ స్మైల్ టీం, బాలమిత్ర పనిచేస్తున్నాయన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ సిబ్బంది రాత్రి, పగలు, పండుగలు సెలవులు అనే తేడా లేకుండా నిరంతరం పనిచేస్తున్నాయన్నారు. మహిళలకు ఎలాంటి సమస్యలు ఉన్నా నిస్సంకోచంగా షీ టీమ్స్ కు ఫిర్యాదు చేయాలన్నారు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. మహిళల భద్రతకు, చిన్నారుల భద్రతకు అనేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అనేక మంది బాలకార్మికులను కాపాడి వారికి అన్నం పెట్టి చదువు చెప్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీసీపీ క్రైమ్స్ ఇందిరా, షీ టీమ్స్ ఇన్ స్పెక్టర్ సునీత, షీ టీం సిబ్బంది, ఆపరేషన్ స్మైల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News