తల్లి మందలించిందని ఆ కూతురు ఏం చేసిందంటే..?

దిశ, మహబూబాబాద్: ప్రస్తుత సమాజంలో బలవన్మరణాలు ఎక్కువైపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకు ప్రాణాలను తీసుకుంటున్నారు. ప్రేమ ఫలించలేదని, చదువులో ఫెయిల్ అయ్యామని, తల్లిదండ్రులు మందలించారని బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో వారు తీసుకుంటున్న ఆ నిర్ణయం తల్లిదండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగులుస్తుంది. తాజాగా ఇంటికి ఆలస్యంగా ఎందుకు వచ్చావ్ ? అని తల్లి మందలించడంతో ఓ బిడ్డ బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మహబూబాబాద్ జిల్లా లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా […]

Update: 2021-04-20 05:45 GMT

దిశ, మహబూబాబాద్: ప్రస్తుత సమాజంలో బలవన్మరణాలు ఎక్కువైపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకు ప్రాణాలను తీసుకుంటున్నారు. ప్రేమ ఫలించలేదని, చదువులో ఫెయిల్ అయ్యామని, తల్లిదండ్రులు మందలించారని బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో వారు తీసుకుంటున్న ఆ నిర్ణయం తల్లిదండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగులుస్తుంది. తాజాగా ఇంటికి ఆలస్యంగా ఎందుకు వచ్చావ్ ? అని తల్లి మందలించడంతో ఓ బిడ్డ బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మహబూబాబాద్ జిల్లా లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం సంధ్య తండా కు చెందిన కావేరి (19) సోమవారం రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చింది. అయితే ఆలస్యంగా ఇంటికి వెళ్లిన కావేరిపై తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు? అంటూ నిలదీసింది. దీంతో మనస్థాపానికి గురైన కావేరి మంగళవారం వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో సంధ్య తండా లో విషాదం చోటు చేసుకుంది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నట్లు ఎస్సై జితేందర్ తెలిపారు.

 

Tags:    

Similar News