Formula E-Race: ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ దూకుడు.. అక్కడి నుంచి విచారణ షురూ

ఫార్ములా ఈ-రేస్ (Formula E-Race) కేసులో ఏసీబీ దూకుడు పెంచింది.

Update: 2024-12-20 03:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-రేస్ (Formula E-Race) కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిపై నాలుగు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసిన అధికారులు విచారణను ఇవాళ ప్రారంభించారు. ఈ మేరకు ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదుదారు మునిసిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ (Dana Kishore) స్టేట్‌మెంట్‌ను మరికొద్దిసేపట్లో ఏసీబీ (ACB) అధికారులు రికార్డ్ చేయనున్నారు. అనంతరం ఆయన స్టేట్‌మెంట్ తీసుకుని అక్కడి నంచి నేరుగా హెచ్ఎండీ (HMDA) ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు. అక్కడ పలు రికార్డులను పరిశీలించన్నట్లుగా సమాచారం. ఫార్ములా ఈ-రేసు (Formula E-Race)కు సంబంధించి చెల్లింపులపై అధికారులను ఆరా తీయనున్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది.

కాగా, ఫార్ములా-ఈ కార్‌ రేస్ (Formula-E car racing) వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR)పై ఏసీబీ (ACB) అధికారులు గురువారం నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఇందులో ఏ1గా కేటీఆర్‌ (KTR), ఏ2గా ఐఏఎస్‌ అరవింద్ కుమార్‌ (IAS Aravind Kumar), ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి (BLN Reddy)పై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. మాజీ మంత్రి కేటీఆర్‌పై విచారణకు ఇటీవల గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అనుమతి ఇవ్వడంతో ఆ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని సీఎస్‌ శాంతి కుమారి(CS Shanthi Kumari) ఏసీబీ (ACB)కి లేఖ రాశారు.  

Tags:    

Similar News