తెలంగాణ రైతాంగానికి షాక్.. ఇకనుంచి ఆ పంటలు వద్దన్న మంత్రి..
దిశ, ఎంతుర్కపల్లి: ఇప్పటి నుండి రైతులు వరి నాట్లు వేయవద్దని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం తుర్కపల్లి మండలం చిన్న లక్ష్మాపూర్ లో పీఎసీఎస్ ఆధ్వర్యంలో, వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో అమ్మి 1960 రూపాయలు పొందవచ్చు అని సూచించారు. వడ్ల కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. యాసంగిలో […]
దిశ, ఎంతుర్కపల్లి: ఇప్పటి నుండి రైతులు వరి నాట్లు వేయవద్దని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం తుర్కపల్లి మండలం చిన్న లక్ష్మాపూర్ లో పీఎసీఎస్ ఆధ్వర్యంలో, వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో అమ్మి 1960 రూపాయలు పొందవచ్చు అని సూచించారు. వడ్ల కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. యాసంగిలో రైతులు వరినాట్లను వేయవద్దని, ప్రత్యామ్నాయ పంటలే వేయాలని విన్నవించారు.
ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, ఎంపీపీ భూక్యా సుశీల రవీందర్ నాయక్, జడ్పీ వైస్ చైర్మన్ బిక్కు నాయక్, ఇతర టీఆర్ఎస్ నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.