కేంద్ర బృందంతో ముగిసిన సీఎస్ భేటి..

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలకు నగర జీవనం అస్థవ్యస్తం అయిన విషయం తెలిసిందే. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులను అధ్యయం చేసేందుకు కేంద్ర బందం ఇవాళ హైదరాబాద్‌కు చేరుకుంది. బీఆర్కేఆర్ భవన్‌లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌తో కేంద్ర బృందం సభ్యులు అయిన భేటీ కొద్దిసేపటి కిందటే ముగిసింది. వరద ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను కేంద్ర బృందానికి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ వివరించారు. […]

Update: 2020-10-22 05:15 GMT

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలకు నగర జీవనం అస్థవ్యస్తం అయిన విషయం తెలిసిందే. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులను అధ్యయం చేసేందుకు కేంద్ర బందం ఇవాళ హైదరాబాద్‌కు చేరుకుంది. బీఆర్కేఆర్ భవన్‌లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌తో కేంద్ర బృందం సభ్యులు అయిన భేటీ కొద్దిసేపటి కిందటే ముగిసింది.

వరద ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను కేంద్ర బృందానికి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ వివరించారు. అనంతరం రెండు బృందాలుగా విడిపోయి రాష్ట్రంలో వరద పరిస్థితిని కేంద్రం బృందం అధ్యయనం చేయనుంది. అలాగే పాతబస్తీ చాంద్రాయణ గుట్ట పల్లె చెరువు, ఇతర వరద ముంపు ప్రాంతాలను ఇద్దరు సభ్యుల కేంద్ర బృందం సందర్శించనున్నారు.

అదేవిధంగా మరికాసేపట్లో మరో ఇద్దరు సభ్యుల కేంద్ర బృందం సిద్దిపేట బయలు దేరనున్నారు. జిల్లాల్లో పంట నష్టాన్ని కూడా అంచనా వేయనున్నట్లు సమాచారం. పర్యటన తరవాత రాష్ట్రంలోని వరద పరిస్థితిపై కేంద్రానికి ఐదుగురు సభ్యుల కేంద్ర బృందం నివేదిక ఇవ్వనుంది.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..