నేడు కాళేశ్వరానికి సీఎం కేసీఆర్..

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. పూర్తి స్థాయిలో రిజర్వాయర్ నిండినందున స్వయంగా వెళ్లి పరిశీలించాలనుకున్నట్లు సాగునీటి పారుదల శాఖ అధికారులు పేర్కొన్నారు. ఉదయం పది గంటలకు ప్రగతి భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి వెళ్ళి హెలికాప్టర్ ద్వారా నేరుగా కాళేశ్వరం చేరుకుంటారు. తొలుత కాళేశ్వరం ఆలయాన్ని సందర్శించి పూజలు చేసి అనంతరం మేడిగడ్డకు బయలుదేరనున్నారు. లక్ష్మీ బ్యారేజీని సందర్శించి అక్కడి అధికారుల ద్వారా అనేక వివరాలను తెలుసుకుంటారు. సుమారు […]

Update: 2021-01-18 21:05 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. పూర్తి స్థాయిలో రిజర్వాయర్ నిండినందున స్వయంగా వెళ్లి పరిశీలించాలనుకున్నట్లు సాగునీటి పారుదల శాఖ అధికారులు పేర్కొన్నారు. ఉదయం పది గంటలకు ప్రగతి భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి వెళ్ళి హెలికాప్టర్ ద్వారా నేరుగా కాళేశ్వరం చేరుకుంటారు. తొలుత కాళేశ్వరం ఆలయాన్ని సందర్శించి పూజలు చేసి అనంతరం మేడిగడ్డకు బయలుదేరనున్నారు. లక్ష్మీ బ్యారేజీని సందర్శించి అక్కడి అధికారుల ద్వారా అనేక వివరాలను తెలుసుకుంటారు. సుమారు రెండున్నర గంటల పాటు అక్కడే వివిధ అంశాలను వారితో చర్చించనున్నారు.

వారితో కలిసి లంచ్ చేస్తారని, రానున్న వేసవి కాలానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని లింకుల వివరాలను తెలుసుకుని తదనుగుణమైన ఆదేశాలు జారీ చేస్తారని సాగునీటిపారుదల వర్గాల సమాచారం. సుమారు నాలుగు గంటల పాటు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపైనే దృష్టి పెడతారని, ఆ తర్వాత సాయంత్రానికి హైదరాబాద్ తిరుగు ప్రయాణమవుతారని పేర్కొన్నాయి. యాసంగి సాగును దృష్టిలో పెట్టుకుని లింకు-1, 2ల ద్వారా ఆదివారం పంపులను ఆన్ చేసి నీటిని ఎత్తిపోశారు అధికారులు.

Tags:    

Similar News