దళిత బంధుకు కేసీఆర్ కండీషన్.. అలా చేస్తేనే డబ్బులు
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘దళిత బంధు’ కార్యక్రమాన్ని హుజూరాబాద్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతీ దళిత కుటుంబానికి ఈ పథకం వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. దళిత ప్రభుత్వ అధికారులకూ అందజేస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ సందర్భంగా ఒక కండీషన్ కూడా పెట్టారు. ‘దళితబంధు’ పొందాలంటే దళితులు అందరూ కొత్త బ్యాంకు ఖాతాలు తీసుకోవాలని, కొత్త […]
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘దళిత బంధు’ కార్యక్రమాన్ని హుజూరాబాద్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతీ దళిత కుటుంబానికి ఈ పథకం వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. దళిత ప్రభుత్వ అధికారులకూ అందజేస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ సందర్భంగా ఒక కండీషన్ కూడా పెట్టారు. ‘దళితబంధు’ పొందాలంటే దళితులు అందరూ కొత్త బ్యాంకు ఖాతాలు తీసుకోవాలని, కొత్త ఖాతా తీస్తేనే దళితబంధు వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.