వెండితెరపై వెలిగే చాన్స్.. ‘చుపె రుస్తం’ యాప్

దిశ, వెబ్‌డెస్క్ : వెండితెర.. ఎందరికో కలల ప్రపంచం. ఈ రంగుల తెరపై రాణించాలని, తమ ప్రతిభతో ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోవాలనే ఆరాటంతో ఒక్క చాన్స్.. అంటూ అవకాశాల కోసం నిరీక్షించేవారు ఎందరో. తమ డ్రీమ్‌ను ఫుల్‌ఫిల్ చేసుకోవాలంటే.. ఎన్నో ప్రొడక్షన్ ఆఫీసులు చుట్టూ చెప్పులరిగేలా తిరగాలి, ఎందరినో కలవాలి. ఒక్కోసారి.. ఆ కల నెరవేరడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, అసలు నెరవేరకపోవచ్చు కూడా. ఈ క్రమంలోనే ఎంతో మంది తమ కలలకు స్వస్తిచెప్పి ఏదో ఒక […]

Update: 2020-08-16 02:52 GMT

దిశ, వెబ్‌డెస్క్ :
వెండితెర.. ఎందరికో కలల ప్రపంచం. ఈ రంగుల తెరపై రాణించాలని, తమ ప్రతిభతో ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోవాలనే ఆరాటంతో ఒక్క చాన్స్.. అంటూ అవకాశాల కోసం నిరీక్షించేవారు ఎందరో. తమ డ్రీమ్‌ను ఫుల్‌ఫిల్ చేసుకోవాలంటే.. ఎన్నో ప్రొడక్షన్ ఆఫీసులు చుట్టూ చెప్పులరిగేలా తిరగాలి, ఎందరినో కలవాలి. ఒక్కోసారి.. ఆ కల నెరవేరడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, అసలు నెరవేరకపోవచ్చు కూడా. ఈ క్రమంలోనే ఎంతో మంది తమ కలలకు స్వస్తిచెప్పి ఏదో ఒక జాబ్‌లో చేరిపోతారు. అయినా తమ డ్రీమ్‌ను చంపుకోలేక సతమతమవుతుంటారు. ఇలాంటి వారికోసమే ఓ యాప్‌ను తీసుకొచ్చాడు.. ప్రముఖ బాలీవుడ్ దర్శక, నిర్మాత ప్రకాష్ ఝా.

నవీన్ పొలిశెట్టి.. ఈ నటుడి గురించి వినే ఉంటారు. తెలుగులో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో కెరీర్‌లో తొలి బ్రేక్‌ను అందుకున్నాడు. కానీ అంతకుముందు ఒక్క అవకాశం కోసం అతడు వెళ్లని టాలీవుడ్, బాలీవుడ్ ప్రొడక్షన్ ఆఫీస్ లేదంటే అతిశయోక్తి కాదు. కానీ అదృష్టం తలుపు తట్టలేదు. దీంతో కొన్నాళ్లపాటు ఉద్యోగం చేశాడు. కానీ మనసు చంపుకోలేక తిరిగి ముంబై వెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. స్టాండ్ బై కమెడియన్ అవతారమెత్తాడు. యూట్యూబ్ సిరీస్‌లో చేశాడు. చివరకు ఎలాగోలా.. చాన్స్ దక్కించుకున్నాడు. ఏజెంట్ సినిమాతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలాంటి వాళ్లు.. మనలో చాలా మంది ఉంటారు. వారికోసమే ప్రకాష్ ఝా ఆలోచించాడు. ప్రధానంగా రూరల్ టాలెంట్‌ను ప్రోత్సహించాలనుకునే ఉద్దేశంతో ‘చుపె రుస్తం’ (chhupe rustam) అనే యాప్‌ను మన ముందుకు తీసుకొచ్చాడు. ఇదో వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్. ఈ యాప్‌ను ఈ రోజే (ఆదివారం) నేషనల్ వైడ్‌గా లాంచ్ చేస్తున్నాడు ప్రకాష్.

ఇందులో యూజర్లు.. సింగింగ్, డ్యాన్సింగ్, యాక్టింగ్, కామెడీ తమ టాలెంట్‌ ఏదైనా ప్రదర్శించవచ్చు. ప్రొడక్షన్ హౌజ్‌లు, కాస్టింగ్ డైరెక్టర్స్, ఇతర సినీ ప్రముఖులు కూడా ఇందులో ఉంటారు. మీ టాలెంట్ వారి దృష్టిలో పడితే చాలు.. వెండితెరపై వెలిగే చాన్స్ రావచ్చు. ఇందులో కాంటెస్ట్‌లు కూడా నిర్వహిస్తారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారిని ప్రత్యేకమైన ‘బే’ సెక్షన్‌లో ప్రమోట్ చేస్తారు. అంతేకాదు.. కాస్టింగ్ కాల్ యాడ్స్ కూడా ఇందులో పోస్ట్ అవుతుంటాయి. ఇది యాప్ పూర్తిగా ఉచిత సర్వీస్ అని నిర్వాహకులు చెబుతున్నారు. ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లలో ఈ యాప్ అందుబాటులో ఉంది.

‘పరిశ్రమకు, టాలెంటెడ్ పీపుల్స్‌కు ఇంకా వైడ్ గ్యాప్ ఉంది. ప్రొఫెషనల్స్ చాలామందిలో ప్రతిభ ఉంటుంది. కానీ వారు ఆడిషన్స్ కోసం పెద్ద క్యూలో నిలబడలేరు. అంతేకాదు, దూర ప్రాంతాల నుంచి ముంబై రావాలన్నా.. ఎంతో టైమ్ తీసుకోవాలి. దీంతో వారంతా బ్యాక్ సీట్‌కే పరిమితమవుతున్నారు. వారికి అవకాశం వస్తే.. తమ ప్రతిభను చాటుతారు. తమ కల నెరవేర్చుకోవడానికి సరైన ప్లాట్‌ఫామ్‌ కోసమే ఈ యాప్..’ అని ప్రకాశ్ ఝా చెప్పారు.

Tags:    

Similar News