18 జిల్లాల్లో సంపూర్ణ లాక్‌డౌన్
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసులు ఎక్కువగా నమోదవుతున్న 18 జిల్లాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని సీఎం భూపేష్ వెల్లడించారు. కరోనా కట్టడికి స్టేట్ డిజాస్టర్ ఫండ్ నుంచి రూ.50 కోట్లు కేటాయించారు. రైళల్లో, విమానాల్లో ఛత్తీస్‌గఢ్‌కి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ చూపించాలని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తెలిపింది. 72 గంటల ముందు […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసులు ఎక్కువగా నమోదవుతున్న 18 జిల్లాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని సీఎం భూపేష్ వెల్లడించారు. కరోనా కట్టడికి స్టేట్ డిజాస్టర్ ఫండ్ నుంచి రూ.50 కోట్లు కేటాయించారు.
రైళల్లో, విమానాల్లో ఛత్తీస్‌గఢ్‌కి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ చూపించాలని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తెలిపింది. 72 గంటల ముందు చేయించుకున్న కరోనా నెగిటివ్ రిపోర్ట్ చూపిస్తే రాష్ట్రంలోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది. రిపోర్టు చూపించనివారికి రైల్వే స్టేషన్లలోనే కరోనా టెస్టులు చేస్తామంది.