మే 31 వరకు లాక్ డౌన్ పొడిగించిన ప్రభుత్వం..

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. మనదేశంలో రోజుకు సగటను 3 లక్షల కేసులు 4 వేలు మరణాలు నమోదవుతున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కరోనా కట్టడికి లాక్ డౌన్ ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం నిర్దారించింది. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు లో ఉన్న విషయం తెలిసిందే. ఇక ఛత్తీస్‌గఢ్‌ లో ఇప్పటికే లాక్ డౌన్ అమలులో ఉంది.  గత కొద్ది రోజులుగా కరోనా ఇన్‌ఫెక్షన్ కేసుల సంఖ్య క్షీణిస్తున్నప్పటికీ, […]

Update: 2021-05-14 23:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. మనదేశంలో రోజుకు సగటను 3 లక్షల కేసులు 4 వేలు మరణాలు నమోదవుతున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కరోనా కట్టడికి లాక్ డౌన్ ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం నిర్దారించింది. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు లో ఉన్న విషయం తెలిసిందే. ఇక ఛత్తీస్‌గఢ్‌ లో ఇప్పటికే లాక్ డౌన్ అమలులో ఉంది. గత కొద్ది రోజులుగా కరోనా ఇన్‌ఫెక్షన్ కేసుల సంఖ్య క్షీణిస్తున్నప్పటికీ, వైరస్ మరింతగా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ ని మే 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని మినహాయింపులతో తదుపరి లాక్‌డౌన్ కొనసాగించనున్నట్లు తెలిపింది. మార్కెట్లలోని దుకాణాలను ప్రత్యామ్నాయ రోజుల ఆధారంగా తెరవవచ్చు. అయితే ఆదివారం మాత్రం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలులో ఉంటుందని ప్రకటించింది. అప్పటికి కరోనా కేసులు మరింతగా తగ్గుముఖం పడితే తప్పనిసరిగా లాక్‌డౌన్‌ ఎత్తివేసే అవకాశాలున్నాయని స్పష్టం చేసింది.

Tags:    

Similar News